Minister KTR : ప్ర‌తిప‌క్షాల‌కు చుక్క‌లు చూపిస్తాం

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వార్నింగ్

Minister KTR : ప్ర‌తిపక్షాల‌పై నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. శ‌నివారం హైద‌రాబాద్ లో ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వ‌ర‌కు రూ. 450 కోట్ల‌తో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్(KTR) ప్ర‌సంగించారు. దేశానికే తెలంగాణ ఆద‌ర్శంగా మారింద‌న్నారు. ఎక్క‌డా లేని రీతిలో తెలంగాణ‌లో లా అండ్ ఆర్డ‌ర్ బాగుంద‌న్నారు. అనేక సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. రాబోయే రోజుల్లో ప్ర‌తిప‌క్షాల‌కు భ‌విష్య‌త్తు లేకుండా చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Minister KTR Slams to Opposition

ఆనాటి స‌మైక్య పాల‌న‌లో ఏడాదికి ప‌ది రోజుల చొప్పున క‌ర్ఫ్యూలు ఉండేవ‌ని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ సీన్ లేద‌న్నారు. ఐటీ ప‌రంగా ఇండియాలోనే హైద‌రాబాద్ టాప్ లో ఉంద‌న్నారు. గ‌తంలో 50 వేల మందికి మాత్ర‌మే ఛాన్స్ ఉండేద‌ని కానీ ఇప్పుడు 2,80,000 వేల మంది ప‌ని చేస్తున్నార‌ని చెప్పారు. ఇది అభివృద్దికి న‌మూనా అని పేర్కొన్నారు.

ద‌శాబ్దాల కాలం నుంచి క‌ల నెర‌వేరింద‌ని చెప్పారు. హైద‌రాబాద్ లో ఇది 36వ ఫ్లై ఓవ‌ర్ అని తెలిపారు కేటీఆర్. కొత్త‌గా నిర్మించిన స‌చివాల‌యంకు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ పేరు పెట్టామ‌న్నారు. అదే రీతిన తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన‌, కార్మిక నేత‌గా గుర్తింపు పొందిన దివంగ‌త నాయిని న‌ర్శింహారెడ్డి పేరు పెట్ట‌డం జ‌రిగింద‌ని తెలిపారు కేటీఆర్.

Also Read : Rahul Gandhi Unstoppable : రాహుల్ గాంధీ అన్ స్టాప‌బుల్

Leave A Reply

Your Email Id will not be published!