Minister KTR Modi : మోదీ కామెంట్స్ కేటీఆర్ సీరియస్
మేం చీటర్స్ కాదు ఫైటర్స్
Minister KTR Modi : హైదరాబాద్ – ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ను ఎన్డీయేలో కలుపుతానంటూ తన తండ్రి సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని పీఎం మోదీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పూర్తిగా సత్యదూరమన్నారు. నిత్యం అబద్దాలను ప్రచారం చేసే బీజేపీకి ఇది మంచి పద్దతి కాదన్నారు.
Minister KTR Modi Comments
తాము ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. తమతోనే పొత్తు పెట్టుకునేందుకు అన్ని పార్టీలు తహ తహ లాడుతున్నాయని పేర్కొన్నారు. మోదీ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని ముందు తన పాలన ఎలా ఉందో చూసుకోవాలని హితవు పలికారు.
ఇప్పటి వరకు తాము ఎవరితో కలిసి ముందుకు సాగలేదన్నారు కేటీఆర్(Minister KTR). ఈ దేశంలో అత్యంత బలమైన, సమర్థవంతమైన నాయకుడు కేసీఆర్ అని ఆయనతో ఢీకొనాలంటే దమ్ముండాలన్నారు. చిల్లర మాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తమ చరిత్రలో లేదన్నారు.
ఈ దేశంలో ఝూటా పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపేనని ఎద్దేవా చేశారు కేటీఆర్. దమ్ముంటే జైలులో వేయాలని సవాల్ విసిరారు. ఇకనైనా ప్రజలకు మేలు చేసే పనులు చేస్తే బావుంటుందన్నారు మంత్రి.
Also Read : CM KCR : 6 నుంచి తెలంగాణలో అల్పాహారం