KTR : యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలకాలి
పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్
KTR : విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే టీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా తన స్టాండ్ తీసుకుంది.
ఆ మేరకు బీజేపీ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు కాకుండా యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఆ మేరకు కేటీఆర్(KTR) కూడా నామినేషన్ దాఖలు చేసే సమయంలో హాజరయ్యారు.
అయితే కాంగ్రెస్ పార్టీతో తాము విభేదిస్తామని స్పష్టం చేశారు. నామినేషన్ అనంతరం యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) తో కలిసి మాట్లాడారు కేటీఆర్. ఈ సందర్భంగా హైదరాబాద్ కు రావాలని ఆహ్వానించారు.
ఈ మేరకు సిన్హా కేటీఆర్ ఆహ్వానం మేరకు జూలై 2న భాగ్యనగరానికి రానున్నారు. ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మంత్రులు, ఇతర నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు మంత్రి. యశ్వంత్ సిన్హాకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పాలని సూచించారు. ఈ మేరకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు కేటీఆర్.
2వ తేదీ ఉదయం 10 గంటలకు యశ్వంత్ సిన్హా ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా జల విహార్ కు చేరుకుంటారు. సిన్హాకు మద్దతుగా 11 గంటలకు సభ ఏర్పాటు చేసింది.
ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లలో మునిగి పోయారు.
Also Read : పదో తరగతి ఫలితాల్లో బాలికలు టాప్