Minister KTR : బీఆర్ఎస్ కు ఢోకా లేదు
ఐటీ మంత్రి కేటీఆర్
Minister KTR : కామారెడ్డి – తెలంగాణలో జరిగే ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా తన తండ్రి, బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ బరిలో నిలిచిన కామారెడ్డిలో పర్యటించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో ప్రసంగించారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.
Minister KTR Comment
ఇవాళ దార్శనికుడైన నాయకుడి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు నమ్మారని , అదే మరోసారి రిపీట్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు కేటీఆర్(Minister KTR). ఢిల్లీ నుంచి టూర్ లీడర్లను ప్రజలు విశ్వసించడం లేదని స్పష్టం చేశారు.
జనం అభివృద్దిని కోరుకుంటున్నారని, కానీ కులం, మతం పేరుతో చిచ్చులు పెట్టే పార్టీలను కావాలని అనుకోవడం లేదన్నారు కేటీఆర్. 75 ఏళ్లయినా ఇంకా ఈ దేశం , రాష్ట్రంలో పేదలు ఉన్నారంటే కారణం కాంగ్రెస్, బీజేపీ పార్టీలేనంటూ మండిపడ్డారు.
నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కోరి తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ది చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కార్ కే దక్కుతుందన్నారు కేటీఆర్.
Also Read : Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు