Minister KTR : గెలుపు పక్కా గులాబీదే జెండా
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : పరిగి – త్వరలో తెలంగాణలో జరిగే శాసనసభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR ). ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ రోడ్ షో చేపట్టారు. వేలాది మంది తరలి వచ్చారు. అశేష ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Minister KTR Comment
ప్రతిపక్షాలు చేసే విమర్శలను తాము పట్టించుకోమని అన్నారు కేటీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సర్కార్ ఆచరిస్తోంది భారత దేశం అనుసరిస్తోందన్నారు కేటీఆర్.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని పేర్కొన్నారు. ప్రతి చోటా భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారని ఇది తాము గెలవ బోతున్నందుకు నిదర్శనమని అన్నారు కేటీఆర్.
ఈసారి ఎన్నికల్లో మొత్తం 119 సీట్లకు గాను కనీసం 100కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు మంత్రి. ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా రావంటూ ఎద్దేవా చేశారు.
Also Read : Tula Uma : గులాబీ గూటికి తుల ఉమ