Minister KTR : హైదరాబాద్ లో మెట్ లైఫ్
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బిజీగా ఉన్నారు. అమెరికా టూర్ లో పలువురు ప్రముఖులను కలుసుకున్నారు. దిగ్గజ కంపెనీల చైర్మన్లు, సిఇఓలతో ముచ్చటించారు. తాజాగా అమెరికా లోని మిడ్ టౌన్ లోని మెట్ లైఫ్ గొప్పతనాన్ని ఎల్లప్పుడూ ఆకర్షించిందని కేటీఆర్ పేర్కొన్నారు.
Minister KTR in America
తెలంగాణ కోసం పిచ్ ని రూపొందించడం కోసం 25 ఏళ్ల తర్వాత అదే భవనంలో మెట్ లైఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతో సమావేశం కావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని స్పష్టం చేశారు ఐటీ మంత్రి.
ఇందులో భాగంగా హైదరాబాద్ బీఎఫ్ఎస్ఐ ల్యాండ్ స్కేప్ ను మరింత బలోపేతం చేసేందుకు మెట్ లైఫ్ తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) వెల్లడించారు. ఇందుకు తాను థ్యాంక్స్ తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు కేటీఆర్.
ఇదిలా ఉండగా ఐటీ, ఫార్మా, ఆటో తదితర రంగాలలో హైదరాబాద్ టాప్ లో నిలిచిందని వెల్లడించారు. ఇవాళ దేశానికి తమ నగరం కేరాఫ్ గా నిలిచిందని స్పష్టం చేశారు మంత్రి. ప్రపంచ స్థాయిలో దిగ్గజ ఐటీ, ఫార్మా దిగ్గజ కంపెనీలు ఇక్కడ కొలువు తీరాయి.
Also Read : R Praggnandha : క్యాండిడేట్స్ టోర్నీకి ప్రజ్ఞానంద అర్హత