Minister KTR : మైనార్టీ పిల్లల కోసం ప్రత్యేక స్కూల్స్
స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ – తమ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు మంత్రి కేటీఆర్(Minister KTR). మైనార్టీ పిల్లల చదువు కోసం ప్రత్యేక స్కూళ్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి చిన్నారిపై రూ. 10 వేలకు పగైఆ ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం నగరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
Minister KTR Promiss
ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు 61 శాతం పెరిగాయని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. మేనిఫెస్టోలో ప్రత్యేకంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మహిళా వర్సీటీలు, కళ్యాణ లక్ష్మి, అమ్మ ఒడి లాంటి పథకాలను తీసుకు వచ్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు. మళ్లీ గెలిచాక మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తామని తెలిపారు కేటీఆర్.
ఇందులో భాగంగా పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం, డిజిటల్ తరగతులు, పోటీ పరీక్షలకు కోచింగ్, సన్న బియ్యంతో కూడిన ఆహారం, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో బోర్డింగ్ మొదలైన ప్రభుత్వ సంస్థల్లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు.
Also Read : Congress Manifesto : కాంగ్రెస్ మేనిఫెస్టో పీపుల్స్ మేనిఫెస్టో