Minister KTR : సంక్షేమమే లక్ష్యం అభివృద్ది నినాదం
ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ – దేశంలోనే ఇవాళ అత్యంత జనాదరణ కలిగిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని స్పష్టం చేశారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR). ఆయనతో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ , లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చారు మంత్రి .
Minister KTR Comment Viral
కులం, మతం, ప్రాంతం అన్న తేడా లేకుండా ఇవాళ హైదరాబాద్ విరాజిల్లుతోందని స్పష్టం చేశారు. కొందరు వీటిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని కానీ జనం వారిని పట్టించు కోవడం లేదని ఆరోపించారు కేటీఆర్.
ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువగా తమ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రముఖ దిగ్గజ నటుడు రజనీకాంత్ కూడా గతంలో కంటే ఇప్పుడు అద్భుతంగా ఉంది ఈ నగరం అంటూ కితాబు ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ 10 ఏళ్ల కాలంలో సంక్షేమమే లక్ష్యంగా అభివృద్దే నినాదంగా తాము పని చేస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. ఇవే తమను గెలిపిస్తాయన్న నమ్మకం ఉందన్నారు.
Also Read : Election Commission Comment : నేరస్థులపై నజర్ ఏదీ
