Varla Ramaiah : అమరావతి : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్ లాగా మారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య. డీజీపీ అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ బాధ్యతలతో పాటు హక్కులు ఉంటాయన్న వాస్తవాన్ని విస్మరిస్తే ఎలా అని ప్రశ్నించారు.
Varla Ramaiah Comments on DGP Words
డీజీపీ కసిరెడ్డి కామెంట్స్ ను తాను పూర్తిగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. వర్ల రామయ్య(Varla Ramaiah) మీడియాతో మాట్లాడారు. డీజీపీ ఏ ఒక్కటి నిజం చెప్పడం లేదన్నారు. తమ పార్టీ వారిని విస్తు పోయేలా చేస్తోందన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన డీజీపీ పూర్తిగా సర్కార్ కు వత్తాసు పలుకుతున్నారంటూ ఆరోపించారు వర్ల రామయ్య.
తన భర్త , టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన అరెస్ట్ తో గుండె ఆగి చని పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు భార్య నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో యాత్ర చేపట్టిందన్నారు. ఈ విషయాన్ని ముందుగానే డీజీపీకి తెలియ చేశామని స్పష్టం చేశారు వర్ల రామయ్య.
ఇందుకు సంబంధించి ఈనెల 21న డీజీపీకి లేఖ రాశామని, తనకు తెలియదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక మంత్రి రోజా తన స్థాయి దాటి మాట్లాడుతోందంటూ ఆరోపించారు.
Also Read : Minister KTR : సంక్షేమమే లక్ష్యం అభివృద్ది నినాదం
