సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న మ‌హేష్ బాబు

ప్ర‌పంచ వ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న మూవీ రిలీజ్

హైద‌రాబాద్ : ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగిన ద‌ర్శ‌కుల‌లో ఒక‌డిగా గుర్తింపు పొందాడు ఎస్ఎస్ రాజ‌మౌళి. ఆయ‌న ఏ సినిమా తీసినా అది ఓ రికార్డ్ సృష్టిస్తుంది. గ‌తంలో బాహుబ‌లి, బాహుబ‌లి -2 , ఆర్ఆర్ఆర్ తీశాడు. వేల కోట్ల‌ను క‌లెక్ష‌న్స్ చేశాయి ఈ మూవీస్. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా కొన‌సాగుతున్న ప్రిన్స్ మ‌హేష్ బాబు ముఖ్య పాత్ర‌లో వార‌ణాసి చిత్రం తీస్తున్నాడు. ఇందుకు సంబంధించి రోజుకో అప్ డేట్ ఇస్తూ వ‌చ్చాడు ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న‌. తాజాగా హీరో మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్బంగా అరుదైన ఫోటోల‌ను వార‌ణాసికి చిత్రానికి సంబంధించి సామాజిక వేదిక ఎక్స్ లో పంచుకున్నాడు . షేర్ చేసిన నిమిషాల్లోపే వైరల్ గా మారాయి. అంద‌గాడిగా , అమ్మాయిల రాకుమారుడిగా ఇప్ప‌టికే పేరున్న మహేష్ ను మ‌రింత అందంగా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు రాజ‌మౌలి.

భారీ తెలుగు యాక్షన్–అడ్వెంచర్–సైన్స్ ఫిక్షన్ చిత్రంగా దీనిని రూపొందిస్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఇందులో మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎప్ప‌టి లాగే ఎంఎం కీర‌వాణి ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. కేఎల్ నారాయ‌ణ‌, ఎస్ఎస్ కార్తికేయ వార‌ణాసి సినిమాకు నిర్మాత‌లుగా ఉన్నారు. ఇప్ప‌టికే రూ. 1000 కోట్లు పెట్టి ఈ సినిమాను తీస్తున్న‌ట్లు టాక్. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దీనికి కార‌ణం ఎస్ఎస్ రాజ‌మౌళి. త‌ను తీసిన ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వ‌చ్చింది. దీంతో వ‌ర‌ల్డ్ వైడ్ గా పాపుల‌ర్ అయ్యాడు. ఇదిలా ఉండ‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది 2027 ఏప్రిల్ 7వ తేదీన విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. ఇప్ప‌టికే అంచ‌నాల‌కు మించి భారీ ధ‌ర‌కు శాటిలైట్ రైట్స్ కోసం పోటీ ప‌డ‌డం విచిత్రం. ఏది ఏమైనా మార్కెటింగ్ చేయ‌డంలో జ‌క్క‌న్న త‌ర్వాతే ఎవ‌రైనా.

Leave A Reply

Your Email Id will not be published!