KTR Modi : మోదీ పాలనలో దేశం వెనకకు – కేటీఆర్
అసెంబ్లీలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి
KTR Modi : మంత్రి కేటీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా పీఎంను ఏకి పారేశారు. మోదీ పాలనలో దేశం వందేళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. ప్రస్తుతం రాచరిక పాలన సాగుతోందన్నారు. నిన్నటి దాకా అదానీని ఆకాశానికి ఎత్తేసిన వాళ్లు ఇప్పుడు ఏమంటారంటూ ప్రశ్నించారు.
ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం వాటిని వాట్సాప్ యూనివర్శిటీలో ప్రచారం చేయడం అలవాటుగా మారిందన్నారు కేటీఆర్. అప్పుల్లో, అవినీతిలో, అక్రమాల్లో , వనరుల విధ్వంసంలో, బడా కాంట్రాక్టర్లు, వ్యాపారులు, ఆర్థిక నేరస్తులకు దోచి పెట్టడంలో టాప్ లో ఉందని ఎద్దేవా చేశారు.
గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యధిక ద్రవ్యోల్బణం నెలకొందన్నారు. నిరుద్యోగిత రేటు దారుణంగా ఉందన్నారు. అయినా సోయి లేకుండా పాలన సాగిస్తున్నరాంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కేటీఆర్(KTR). ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అత్యధికంగా సిలిండర్ ధర ఇండియాలో మోడీ ఇలాఖాలో ఉందన్నారు.
మొదట్లో 400 రూపాయలు ఉంటే ఇప్పుడు అది 1150కి పెరిగిందన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ గురించి చెప్పాల్సిన పనే లేదన్నారు. ఆయన చేసిన ఘనకార్యాలు ఏవి అని గూగుల్ లో వెతికానని అన్నీ బక్వాస్ మాటలు , సొల్లు కబుర్లేనని తేలిందన్నారు కేటీఆర్.
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారని, అంతటా డబుల్ రైళ్లు పరుగులు తీసేలా చేస్తామన్నారని కానీ ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు మంత్రి. ఐదు ట్రిలియన్ డాలర్లు చేస్తామన్నారు ఒక్క పైసా కూడా రాలేదన్నారు కేటీఆర్. తాము కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు కడితే విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు.
Also Read : దక్షిణ మధ్య రైల్వేకు భారీగా నిధులు