KTR ED CBI : ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. తాము తప్పు చేయలేదన్నారు. మోడీకి , ఆయన చెప్పినట్టు ఆడుతున్న ఈడీ, సీబీఐ, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తి లేదన్నారు కేటీఆర్. ఆస్కార్ అవార్డులు తమ వల్లే వచ్చాయని బీజేపీ ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవా చేశారు.
ఇదే విషయం గురించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన కామెంట్స్ పై ఇప్పటికే చర్చ జరుగుతోందన్నారు. తెలంగాణకు అడ్డంకిగా బీజేపీ, కాంగ్రెస్ తయారైందన్నారు కేటీఆర్(KTR ED CBI). వాళ్లకు విజన్ లేదన్నారు. ఎంత సేపు తమపై ఆడి పోసుకోవడం తప్పితే వేరే పని లేదన్నారు మంత్రి. ఇలాంటి వాళ్లను ప్రజలు నేలకేసి కొట్టడం ఖాయమన్నారు.
ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్ విసిరారు. తాము ప్రజా కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు కేటీఆర్. ఎవరు తప్పు చేశారో వారే నిర్ణయిస్తారని అన్నారు. అంత దాకా ఓపిక పడతామన్నారు కేటీఆర్. కామారెడ్డి జిల్లా జుక్కల్ లో బుధవారం జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. ప్రధానిని , బీజేపీని ఏకి పారేశారు. ఈ దేశంలో మోదీని మించిన నటుడు లేడని ఎద్దేవా చేశారు మంత్రి.
2014లో మాయ మాటలు చెప్పి పవర్ లోకి వచ్చిన మోదీ దేశం గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ప్రచారం తప్ప దేశానికి ఆయన చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇవాళ బీజేపీ చేస్తున్న నిర్వాకాన్ని చూసి చీదరించు కుంటున్నారని పేర్కొన్నారు. దేశం సంపదనంతా తమకు కావాల్సిన వారి ఖాతాల్లోకి వేస్తున్నారంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : ఈడీ విచారణ కవిత హాజరయ్యేనా