Minister KTR : దేశానికే తెలంగాణ రోల్ మోడల్
స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్
Minister KTR : మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ మోడల్ అంటే సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య మని పేర్కొన్నారు. గత తొమ్మిది ఏళ్ల కాలంలో ఐటీ దిగుమతులు రూ. 57, 000 కోట్ల నుండి రూ. 2,41,000 కోట్లకు పెరిగిందని స్పష్టం చేశారు. అదే సమయంలో వరి ధాన్యం ఉత్పత్తి 67 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 3.5 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగిందని తెలిపారు. ఇది దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.
Minister KTR Words on Development
టీఎస్ఐపాస్ విధానం వల్ల తెలంగాణలో 20,000 కొత్త పరిశ్రమలకు అనుమతులు వచ్చాయని వెల్లడించారు. రూ. 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు కేటీఆర్(Minister KTR). వీటి ఏర్పాటు వల్ల దాదాపు 22.5 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని కుండ బద్దలు కొట్టారు మంత్రి. అదే సమయంలో రాష్ట్ర సర్కార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం హరిత హారం కార్యక్రమం కారణంగా పచ్చదనం 7.7 శాతం పెరిగిందన్నారు.
దేశంలో 3 శాతం కన్నా తక్కువ ఉన్న తెలంగాణ జనాభా దేశంలోనే ఏకంగా 30 శాతం పంచాయతీ అవార్డులు పొందిందని ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు కేటీఆర్. పట్టణాల పరిశుభ్రతలో తెలంగాణకు 26 పురస్కారాలు లభించాయని తెలిపారు ఐటీ మంత్రి.
Also Read : Nara Lokesh : రాజధాని అయ్యాకే ఇల్లు కట్టుకుంటాం