Minister Kumaraswamy : కాంగ్రెస్ మాటలన్నీ తప్పు..వాళ్ళు హాసన్ జిల్లాకు చేసిందేమీ లేదు
ప్రకృతిని లూటీ చేసిన వారెవ్వరనేది అందరికీ తెలిసిందేనన్నారు...
Minister Kumaraswamy : కాంగ్రెస్ నేతలు చెప్పేవి కల్లబొల్లి మాటలని, హాసన్ జిల్లాకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని, సీడీలు విడుదల చేయడమే వారి గొప్ప అని కేంద్రమంత్రి కుమారస్వామి(Minister Kumaraswamy) ఎద్దేవా చేశారు. హాసన్ జిల్లాలో సోమవారం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. జిల్లాకు దేవెగౌడ కుటుంబం చేసింది ఏమిటని ఇటీవల డీసీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. హాసన్ జిల్లాకు కాంగ్రెస్ నాయకులు ఏం చేశారని తిరిగి ప్రశ్నించారు. సీడీలు విడుదల చేసి ఎంతో సాధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాసన్ అభివృద్ధి అనేది దేవెగౌడ రాజకీయ ప్రారంభం నుంచి కొనసాగించిన రోజునుంచే జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. వీరు ఓ ఫ్లై ఓవర్ సాధించలేదని, సిగ్గు లేకుండా మాట్లాడతారన్నారు. తాను సీఎంగా ఏమి చేశాననేది జిల్లాలో అందరికీ తెలుసునన్నారు. పలు అభివృద్ధి పనులకు తన హయాంలోనే శ్రీకారం చుట్టానన్నారు. తమ కుటుంబం ప్రజల సొమ్మును లూటీ చేయలేదన్నారు.
Minister Kumaraswamy Comments
ప్రకృతిని లూటీ చేసిన వారెవ్వరనేది అందరికీ తెలిసిందేనన్నారు. దొంగే దొంగ..దొంగ..అన్నట్లుగా కాంగ్రెస్ నేతల మాటలు ఉన్నాయన్నారు. కేంద్రమంత్రి కుమారస్వామి చన్నరాయపట్టణ తాలూకాలోని దేవీరమ్మ దేవి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.పలు ఆలయాలను సందర్శించారు. అనంతరం కాఫీ రైతులతో జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌తో కలసి పాల్గొన్నారు.
Also Read : TG High Court : ఆ కేసులో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులకు ఉరటనిచ్చిన హైకోర్టు