Minister Manikrao Kokate: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి ! మంత్రిపై విపక్ష పార్టీలు ఫైర్ !

అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి ! మంత్రిపై విపక్ష పార్టీలు ఫైర్ !

Manikrao Kokate : మహారాష్ట్రలో ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, మరోవైపు ఆ రాష్ట్ర మంత్రి సెల్‌ఫోన్‌ లో గేమ్‌ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనితో మంత్రి చర్యపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Minister Manikrao Kokate Playing Rummy in Assembly

మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల జరుగుతున్నప్పుడు వ్యవసాయశాఖ మంత్రి మాణిక్‌రావ్‌ కోకాటే (Manikrao Kokate)… ఫోన్‌లో రమ్మీ ఆడుతున్నారని ఎన్సీపీ(ఎస్‌పీ) ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. ‘‘ఓ వైపు రైతుల సమస్యలపై సభలో చర్చ జరుగుతుంటే కోకాటే ఇలా వ్యవహరించారు. రాష్ట్రంలో రోజుకు 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఇవేమీ పట్టించుకోకుండా ఆయన ఆటలాడుతున్నారు’’ అని రోహిత్‌ మండిపడ్డారు.

మరోవైపు కోకాటేపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు శివసేన (యూబీటీ) నేత ఆనంద్‌ దుబే విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కోకాటే… ‘‘నేను యూట్యూబ్‌ వీడియో చూస్తున్నప్పుడు రమ్మీ ఆటకు సంబంధించిన ప్రకటన వచ్చింది. రెండు సార్లు దాన్ని తొలగించేందుకు ప్రయత్నించాను. ప్రతిపక్షాలు కావాలనే అసంపూర్తి వీడియోను ప్రదర్శించి విమర్శిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.

Also Read : Madras High Court: ఈడీపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం

Leave A Reply

Your Email Id will not be published!