Minister Nadendla Manohar: స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల

Nadendla Manohar : ఏపీలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రారంభించారు. విజయవాడ వరలక్ష్మీనగర్‌ లో స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ (Nadendla Manohar) మాట్లాడుతూ… ‘‘సాంకేతికత వినియోగంతో స్మార్ట్‌ రేషన్‌కార్డులు తయారు చేశాం. వీటిలో క్యూఆర్‌ కోడ్‌ పొందుపరిచాం. రేషన్‌ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుంది. 9 జిల్లాల్లో ఇవాళ ఇంటింటికీ రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నాం. 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్‌ 15 కల్లా కార్డులు అందిస్తాం. చౌకబియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కొత్తవారికి, చిరునామా మార్చిన వారికి కూడా పంపిణీ చేస్తాం. భవిష్యత్తులో రేషన్‌ దుకాణాల ద్వారా గోధుమలూ అందజేస్తాం. డీలర్ల వద్ద ఉన్న ఈ-పోస్‌ యంత్రాలను ఆధునికీకరిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 29,797 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. ప్రజల అవసరాల దృష్ట్యా వీటి సంఖ్య పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సబ్‌ డిపోల ఏర్పాటుకు కార్యాచరణ తయారు చేస్తున్నాం’’ అని నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) తెలిపారు.

Nadendla Manohar – హోంగార్డుపై దాడి చేసిన నేతను సస్పెండ్ చేసిన జనసేన అధిష్టానం

మచిలీపట్నంలో హోంగార్డ్‌పై జనసేన నేత కర్రి మహేష్‌ దాడి చేశాడు. ఈ ఘటనపై జనసేన అధిష్టానం చర్యలు చేపట్టింది. దాడికి పాల్పడిన కర్రి మహేష్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. జనసేనలో కర్రి మహేష్ క్రియాశీలక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ బండి రామకృష్ణ తెలిపారు. ఈ ఘటనపై బండి రామకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నిజానిజాలు పూర్తిగా తెలియకపోయినా కేసు నమోదైన నేపథ్యంలో కర్రి మహేశ్ క్రియాశీలక సభ్యత్వాన్ని పార్టీ హైకమాండ్ రద్దు చేసిందని తెలిపారు. పార్టీకి నష్టం చేకూర్చే వాళ్లంటే తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఇష్టం ఉండదని చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవ చేయాలని పవన్ కల్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో తామంతా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పని చేస్తున్నామని ఉద్ఘాటించారు. జనసేన పార్టీకి నష్టం చేకూర్చే వాళ్లపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ బండి రామకృష్ణ హెచ్చరించారు.

Also Read : Minister Kinjarapu Atchannaidu: ఎరువులపై రైతులు ఆందోళన చెందవద్దు – మంత్రి అచ్చెన్నాయుడు

Leave A Reply

Your Email Id will not be published!