Minister Nadendla Manohar: 4 విడతల్లో స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ – మంత్రి నాదెండ్ల మనోహర్‌

4 విడతల్లో స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ - మంత్రి నాదెండ్ల మనోహర్‌

Nadendla Manohar : క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ రేషన్‌కార్డుల్ని ఈ నెల 25 నుంచి నాలుగు విడతల్లో పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా 1.45 కోట్ల కార్డుదారుల కుటుంబాలకు రేషన్‌ దుకాణాల వద్దే వాటిని ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. విజయవాడలోని పౌరసరఫరాల భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ… ‘కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్‌ పంపిణీ 93 శాతానికి చేరింది. కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. ఈసారి కొత్తగా 6.71 లక్షల కార్డులు ఇస్తున్నాం. స్మార్ట్‌కార్డుల్లో రాజముద్రతోపాటు కుటుంబసభ్యుల వివరాలు, క్యూఆర్‌కోడ్‌ ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 1967ను సంప్రదించవచ్చు’ అని నాదెండ్ల మనోహర్‌ సూచించారు.

Nadendla Manohar – ఏయే జిల్లాల్లో ఎప్పుడంటే ?

ఆగస్టు 25 నుంచి విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా,

ఆగస్టు 30 నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు.

సెప్టెంబరు 6 నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, అనకాపల్లి,

సెప్టెంబరు 15 నుంచి బాపట్ల, పల్నాడు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో అందించనున్నారు.

Also Read : KCR: కేసీఆర్‌తో పార్టీ నేతల భేటీ కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై చర్చ

Leave A Reply

Your Email Id will not be published!