Nara Lokesh: గత ప్రభుత్వం మాదిరిగా రహస్య జీవోలు ఇవ్వటం లేదు : మంత్రి లోకేశ్
గత ప్రభుత్వం మాదిరిగా రహస్య జీవోలు ఇవ్వటం లేదు : మంత్రి లోకేశ్
Nara Lokesh: ప్రభుత్వాలు మారినా పాలన అలాగే ఉండాలని, పీపీఏలు రద్దు చేయటం వల్ల రాష్ట్రంతో పాటు దేశం కూడా నష్టపోయిందన్నారు. గత ఐదేళ్లుగా పరిశ్రమల రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని, తమ ప్రభుత్వం పరిశ్రమలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలకు మధ్య సంప్రదింపులకు ఫోరం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, వారం రోజుల్లోగా దీనికి సంబంధించి ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు. 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Nara Lokesh Comment
‘‘పదే పదే ప్రభుత్వ నిర్ణయాలు మార్చేయకుండా ఓ చట్టం తీసుకురావాలని కేంద్రంతో మాట్లాడుతాం. త్వరలోనే ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు ద్వారా పరిశ్రమలకు ఆహ్వానం పలుకుతాం. గత ప్రభుత్వం మాదిరిగా రహస్య జీవోలు ఇవ్వటం లేదు, ప్రతి అంశాన్ని ప్రజలముందు ఉంచుతున్నాం. హౌస్ అరెస్టులు, గేట్లకు తాళ్లు కట్టే ప్రభుత్వం మాది కాదు. పరదాలు కట్టుకుని తిరిగే సీఎం కాదు చంద్రబాబు. లడ్డూ ప్రసాదంలో అపవిత్ర పదార్ధాలు కలిపిన వ్యవహారంలో మా సవాలును వైకాపా నేతలు ఎందుకు స్వీకరించలేదు. 24 గంటల పాటు తిరుపతిలోనే ఉన్నా.. చర్చకు ఎందుకు రాలేకపోయారో వాళ్లే చెప్పాలి’’ అని లోకేశ్ అన్నారు.
Also Read : Botsa Satyanarayana: రాష్ట్రంలోని సమస్యలను డైవర్ట్ చేసేందుకే కుట్ర రాజకీయం చేస్తున్నారు : ఎమ్మెల్సీ బొత్స