Minister Nara Lokesh: ప్రభుత్వ విద్యను రాజకీయాలకు దూరంగా ఉంచాం – మంత్రి లోకేశ్
ప్రభుత్వ విద్యను రాజకీయాలకు దూరంగా ఉంచాం - మంత్రి లోకేశ్
Nara Lokesh : గురువులు చూపించిన దారిలో నడవడం వల్లే తాను స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకోగలిగానని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీచర్ల అందరిని చూసినప్పుడు స్కూల్ డేస్ గుర్తుకు వస్తున్నాయని పేర్కొన్నారు. తనది బ్యాక్ బెంచ్… గోడ బ్యాచ్ అయినా తాను స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లానని… చిన్ననాటి మధుర జ్ఞాపకాలను లోకేశ్ (Nara Lokesh) గుర్తుకు తెచ్చుకున్నారు.
Minister Nara Lokesh Key Comments
ఈ సందర్భంగా టీచర్స్ డే ను ఉద్దేశ్యించి మంత్రి లోకేశ్ (Nara Lokesh) మాట్లాడుతూ… ‘‘పిల్లల జీవితాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. విద్యాశాఖలో ఏడాదిలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. లీప్ మోడల్‌ను అందరం కచ్చితంగా అమలు చేయాలి. మెగా పేరెంట్-టీచర్ సమావేశాలు ఏర్పాటు చేశాం. పిల్లలను యోగా, క్రీడలు, ఎన్‌సీసీ వైపు ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వ విద్యను రాజకీయాలకు దూరంగా ఉంచాం. పుస్తకాల సంచులపై ప్రముఖుల ఫొటోలు ముద్రించాం. సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ పేర్లు పెట్టాం. చంద్రబాబు అంటేనే డీఎస్సీ.. డీఎస్సీ అంటే చంద్రబాబు. ఆయన ఆధ్వర్యంలో 13 డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చి 1,83,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. మొన్నటి డీఎస్సీపై 70 కేసులు పెట్టారు.. అయినా వెనక్కి తగ్గలేదు. న్యాయపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’’ అని లోకేశ్ వివరించారు.
వన్ క్లాస్ వన్ టీచర్ అమలు చేస్తున్నాం
ఉపాధ్యాయ సంఘాలతో అనేకమార్లు కూర్చుని సంస్కరణలు తెచ్చామని మంత్రి లోకేశ్ (Nara Lokesh) పేర్కొన్నారు. ఇక రాబోయే నాలుగు సంవత్సరాలు సంస్కరణలు ఉండవని స్పష్టం చేశారు. లీప్ మోడల్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రైమరీ స్కూళ్లలో 33 శాతం వన్ క్లాస్ వన్ టీచర్ అమలు చేస్తన్నట్లు తెలిపారు. విద్యకు రాజకీయాన్ని దూరం పెట్టాలని ఉపాధ్యాయులను కోరుతున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు అందరికీ సీనియారిటీ లిస్టును బట్టి ట్రాన్స్‌ఫర్‌లు చేశామని వెల్లడించారు. ఇందులో 80 శాతం మంది చంద్రబాబు నాయుడు టర్మ్‌లోనే ఉపాధ్యాయులు అయ్యారని వివరించారు. డీఎస్సీ నిర్ణయం ఎంత ఛాలెంజింగ్ విషయమో.. మీ అందరికీ తెలుసని అన్నారు. డీఎస్సీ నిర్వహించిన సంవత్సరమే రిజల్ట్ ఇచ్చి స్కూళ్ళకు వారిని పంపడం చాలా పెద్ద విషయమని ధీమా వ్యక్తం చేశారు.
లూప్ హోల్స్ స్టడీ చేసి మెగా డీఎస్సీ వేశాం
గత డీఎస్సీ నోటిఫికేషన్‌లలో ఉన్న లూప్ హోల్స్ స్టడీ చేసి మెగా డీఎస్సీ వేశామని మంత్రి లోకేశ్ అన్నారు. ఏయూ తాను మంత్రిగా వచ్చాక 4 వ స్థానానికి వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల ట్రాన్స్‌ఫర్‌లు ఎలా జరిగాయో చూసామన్నారు. జీతాలు 1వ తేదీన రాలేదని ఆరోపించారు. చివరకు ఉపాధ్యాయుల్ని ఎలక్షన్ డ్యూటీలో లేకుండా చేయాలని చూసారని విమర్శించారు. మూడు విషయాలు ఉపాధ్యాయులతో మాట్లాడాలి అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతి క్లాస్ విద్యార్థులకు మ్యాథ్స్ బేసిక్స్ నేర్పించాలని సూచించారు. ఏజ్ అప్రాప్రియేట్ ఎడ్యుకేషన్ అనేది మనవద్ద ఉండాలని సూచించారు. పోటీ పరిక్షల్లో విద్యార్థులు పోటీపడి.. అద్భుతాలు సాధిచేలా ఉపాధ్యాయులు చేయాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు మంచి డైరెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైనా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా రాష్ట్రం ఇప్పడిప్పుడే కష్టాల నుంచి బయటపడుతుందన్నారు. అందరం కలిసి కట్టుగా ఆంధ్రా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను ప్రపంచానికి చూపుదామని లోకేశ్ ఉద్ఘాటించారు.
Also Read : CM Chandrababu: విశాఖలో ఏడీఆర్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధం – సీఎం చంద్రబాబు
