Minister Nara Lokesh: జగన్ ఆంధ్రా సద్దాం హుస్సేన్ – మంత్రి నారా లోకేష్

జగన్ ఆంధ్రా సద్దాం హుస్సేన్ - మంత్రి నారా లోకేష్

Nara Lokesh : వైసీసీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ తనను తాను ఏపీ సద్దాం హుస్సేన్ గా ఊహించుకున్నారు… 30 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతానని కలలు కన్నారంటూ ఎద్దేవా చేశారు. రుషికొండలో నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్ పై మంత్రి లోకేష్ స్పందిస్తూ… ‘తొలుత ఇది ఏపీ ప్రభుత్వ పర్యాటక శాఖ ప్రాజెక్ట్… తర్వాత అది శిశ్ మహల్ గా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను తాను ఏపీ సద్దాం హుస్సేన్ గా భావించారు. అందుకే మరో 30 ఏళ్ల పాటు తానే పదవిలో ఉంటానని నమ్మి… అంత విలాసవంతమై భవనాన్ని నిర్మించారు’ అని చెప్పుకొచ్చారు.

Minister Nara Lokesh Slams

ఈ సందర్భంగా మంత్రి లోకేష్(Nara Lokesh) మాట్లాడుతూ… ‘మా తాత, నాన్న ఇద్దరు ముఖ్యమంత్రులగా పని చేశారు. కానీ వారి హయాంలో నేను ఇంత విలాసవంతమైన భవనాన్ని, ఇంత పెద్ద గదులను చూడలేదు. శిశ్ మహల్ నిర్మాణం కారణంగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ రాష్ట్ర ప్రభుత్వం మీద 200 కోట్ల రూపాయల జరిమానా విధించింది’ అని తెలిపారు.

‘వైసీపీ అధ్యక్షుడిది చాలా చిన్న కుటుంబం. ఆయన తల్లి, సోదరిలను కుటుంబం నుంచి పంపించి వేశారు. ప్రస్తుతం ఆయన, భార్య, పిల్లలు మాత్రమే ఉన్నారు. కేవలం నలుగురు కుటుంబ సభ్యుల కోసం 700 కోట్ల రూపాయల ఖర్చు చేశారు. ఆఖరికి ప్రధాన మంత్రి కూడా ఇంత పెద్ద ఇంట్లో నివాసం ఉండరు’ అని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ఆ భవనాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై ఆలోచనలు చేస్తుంది అని తెలిపారు.

Also Read : Speaker Ayyanna Patrudu: దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు – స్పీకర్ అయ్యన్న

Leave A Reply

Your Email Id will not be published!