CM Nitish Kumar : శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేత, ప్రస్తుత మరాఠా మంత్రి నవాబ్ మాలిక్ సంచలన కామెంట్స్ చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్(CM Nitish Kumar )గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరోసారి ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారనున్నారని పేర్కొనడం విశేషం. ప్రస్తుతం రాష్ట్రపతి రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పటికే రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్,
ఉప రాష్ట్రపతి గా వెంకయ్య నాయుడు ఉన్నారు. కాగా ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు ఉండాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ తరుణంలో ఎలాంటి వివాదాలకు తావు లేని వ్యక్తి,
అందరికీ ఆమోద యోగ్యమైన నాయకుడు అయితే బెటర్ అని భావిస్తున్నారు. ఇదే సమయంలో నవాబ్ మాలిక్ రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల నుంచి బీహార్ సీఎం నితీష్ కుమార్(CM Nitish Kumar )పేరును కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు. అత్యున్నతమైన రాజ్యాంగబద్ద పదవికి నితీష్ కుమార్ అయితే సరిగ్గా సరిపోతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఇంకో షరతు కూడా పెట్టారు నవాబ్ మాలిక్. అదేమిటంటే నితీష్ కుమార్ బీజేపీతో గనుక తెగ తెంపులు చేసుకుంటే తాము ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆయన బీజేపీతో దోస్తీ చేస్తూ వారి మద్దతుతో బీహార్ సిఎంగా పని చేస్తున్నారు. మొత్తం మీద నితీష్ కుమార్ ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారడం విశేషం.
Also Read : పీకే వ్యవహారం టీఎంసీ ఆగ్రహం