Minister Nimmala Rama Naidu: మంత్రి నిమ్మల పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన సీఎం చంద్రబాబు

మంత్రి నిమ్మల పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన సీఎం చంద్రబాబు

 

 

ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పుట్టిన రోజు వేడుకలను సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనతో కేక్‌ కట్‌ చేయించి స్వయంగా కేకు తినిపించారు. ఈ సందర్భంగా రామానాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అలాగే, మంత్రులు గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్‌ సైతం రామానాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుట్టిన రోజును జీవితంలో మరిచిపోలేనని మంత్రి నిమ్మల అన్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను రామానాయుడు ‘ఎక్స్‌’లో షేర్‌ చేసుకున్నారు.

‘‘ఈరోజు నా పుట్టిన రోజు సందర్భంగా అమరావతి సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం నాకు చాలా సంతోషం, సంతృప్తి కలిగించాయి. ఆయనకు కృతజ్ఞతలు. ఆయన స్ఫూర్తి, ఆశీస్సులు, క్రమశిక్షణతో పని చేస్తాను’’ అని పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా… నా పుట్టినరోజును పురస్కరించుకొని ఒక్క రూపాయి ఖర్చు… ఒక్క క్షణం వృధా చేయవద్దు. మంగళవారం పుట్టిన రోజు సందర్భంగా కూటమి శ్రేణులతో పాటు అధికారులు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను. మొదటినుంచి పుట్టినరోజు జరుపుకోవడానికి ఇష్టపడని వ్యక్తిని.ఎందుకంటే పుట్టినరోజుకు ఆర్భాటంగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వృధా ఖర్చు అని భావిస్తుంటాను. ఆ ఉద్దేశంతోనే 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు నుండి పుట్టినరోజుతోపాటు జనవరి 1 నూతన సంవత్సరం రోజున అందుబాటులో ఉండడం లేదు. నా వద్దకు బొకేలు, కేకులు, స్వీట్లు, దండలు, పండ్లు వంటివి తీసుకురావద్దని, శుభాకాంక్షలు తెలిపే ప్రకటనలు ఇవ్వవద్దని వీటికి కోసం డబ్బులు, సమయాన్ని వృధా చేయవద్దని పిలుపునిచ్చాను. అప్పటినుంచి ఇదే ఆనవాయితీగా వస్తుంది. ఈసారి మంత్రి హోదాలో ఉన్నప్పటికీ నా నిర్ణయం లో ఎటువంటి మార్పు లేదు అంటూ మంత్రి నిమ్మల చెప్పిన సంగతి తెలిసిందే.

Leave A Reply

Your Email Id will not be published!