Priyank Kharge : బొకేలు వద్దు పుస్తకాలు ఇవ్వండి – ఖర్గే
కర్ణాటక మంత్రి వినూత్న ఆలోచన
Priyank Kharge : పాలకులు ప్రతిభావంతులైతే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. పవర్ లో ఉండడమే కాదు ప్రజలకు సేవ చేయాలన్న తలంపు కూడా ఉండాలి. తాజాగా కర్ణాటకలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే(Priyank Kharge) సంచలన ప్రకటన చేశారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కొత్త కేబినెట్ లో కీలక మంత్రిగా పదవి చేపట్టారు. ఈ సందర్భంగా సంచలన ప్రకటన చేశారు.
తన కోసం అభినందించేందుకు వచ్చే వాళ్లు దయచేసి బొకేలు, శాలువాలు తీసుకు రావద్దని కోరారు. వీటికి బదులు విద్యార్థులకు , ప్రజలకు మేలు చేకూర్చేలా సమాజాన్ని ప్రభావితం చేసేలా పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో ప్రియాంక ఖర్గే ఇచ్చిన పిలుపునకు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఆయన ఆఫీసు నిండి పోయేందుకు సిద్దమైంది.
పిల్లలకు మనో వికాసం కలిగించే మంచి పుస్తకాలను ఇవ్వడం వల్ల వారికి గొప్ప భవిష్యత్తును అందించిన వాళ్లం అవుతామని ఈ సందర్భంగా ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. కర్ణాటకలో బంపర్ మెజారిటీతో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రజా పాలన అందించేందుకు సిద్దమైంది. ఏది ఏమైనా పదవి కంటే ప్రజలే ముఖ్యమని, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయని నమ్మిన ప్రియాంక్ ఖర్గే అభినందనీయుడు కదూ.
Also Read : Chandrababu Naidu : జేడీ కూతురి పెళ్లిలో చంద్రబాబు