Minister Rajnath Singh: ‘ఆపరేషన్ సిందూర్’ ఉగ్ర మూకలకు వణుకు పుట్టించింది – రాజ్‌నాథ్
‘ఆపరేషన్ సిందూర్’ ఉగ్ర మూకలకు వణుకు పుట్టించింది - రాజ్‌నాథ్
Rajnath Singh : ఉగ్రవాదులకు వణుకు పుట్టించడంలో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ (Rajnath Singh) … రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన రెండో ఏడాది పదవీకాలం (ఆగస్టు 2023- జులై 2024)లో చేసిన 51 ప్రసంగాల కలెక్షన్‌తో రూపొందించిన ‘వింగ్స్ టు అవర్ హోప్స్ -వాల్యూమ్ II’ పుస్తకాన్ని విడుదల చేశారు. దీనితో పాటు హిందీ వెర్షన్ ‘Ashaon Ki Udaan – Khand 2’ను ఈ-వెర్షన్ ను కూడా అధికారికంగా విడుదల చేశారు. ఈ వ్యాసాల సంకలనాన్ని రాష్ట్రపతి భవన్ చేపట్టగా, కేంద్ర సమాచార, ప్రసార శాఖ సారథ్యంలోని పబ్లికేషన్స్ డివిజన్ ప్రచురించింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎల్.మురుగన్ తదితరులు పాల్గొన్నారు.
Union Minister Rajnath Singh Key Comments
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాయకత్వం, విజన్‌ను రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రశంసిస్తూ, ఈ పుస్తకం కేవలం ప్రసంగాల సంకలనం కాదని, భారత భవిష్యత్తును లిపిబద్ధం చేసే డాక్యుమెంట్ అని అన్నారు. గవర్నెన్స్, ఇన్‌క్ల్యూజివిటీ, జాతీయ ఆకాంక్షలను చాటిచెబుతోందని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యసాధనకు ఒక మార్గదర్శిగా నిలుస్తుందని చెప్పారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుందని తెలిపారు. ఇది వికసిత్ భారత్ దార్శనికతకు ఓ కర్మగ్రంథంగా మారుతుందని పేర్కొన్నారు. వింగ్స్ టు అవర్ హోప్స్ వాల్యూమ్- 2 అనే ఈ గ్రంథం 2047 నాటికి వికసిత్ భారత్‌ను నిర్మించాలనే లక్ష్యాన్ని సాధించేందుకు ఓ మార్గనిర్దేశకత్వాన్ని అందిస్తుందని అభిప్రాయపడ్డారు.
Also Read : Vande Bharat: వందే భారత్ లో ప్రయాణికుడిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
