Minister Ram Mohan Naidu : గుంటూరు పర్యటనలో కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

నేటి తరానికి ఈ విషయాలన్నీ తెలియజెప్పాల్సిన అవసరముందని అన్నారు...

Ram Mohan Naidu : వైసీపీ హయాంలో మంత్రులకు ఎలాంటి అధికారం లేదని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. బీసీల ధైర్యాన్ని చూపించి పార్లమెంటులో తాను గట్టిగా నిలబడ్డానని తెలిపారు. తనను గతంలో పార్లమెంటులో అవమానించేలా వైసీపీ సభ్యులు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడు వారసుడిగా వచ్చిన తనను 3సార్లు ఎంపీగా గెలిపించారని గుర్తుచేశారు. వయసులో చిన్నవాడినైనా తనకు కేంద్రమంత్రిగా చంద్రబాబు అవకాశం కల్పించారని చెప్పారు. బీసీలంటే చంద్రబాబుకు ఎంత ప్రేమో చెప్పేందుకు తానే నిదర్శనమన్నారు. బీసీలంతా ఐకమత్యంతో పనిచేసి సమస్యల పరిష్కారం కోసం పని చేద్దామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.ఇవాళ(సోమవారం) గుంటూరు జిల్లాలో రామ్మోహన్ నాయుడు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఏపీలో బీసీల నాయకత్వానికి స్వర్గీయ ఎన్టీఆర్ పునాదులు వేశారని తెలిపారు.

Minister Ram Mohan Naidu Comments

నేటి తరానికి ఈ విషయాలన్నీ తెలియజెప్పాల్సిన అవసరముందని అన్నారు. పంచాయతీ మెట్లు ఎక్కలేని బీసీలను పార్లమెంటు మెట్లు ఎక్కేలా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చిందని అన్నారు. ఎన్టీఆర్ వేసిన పునాదులను పటిష్టం చేసేలా చంద్రబాబు పని చేస్తున్నారని అన్నారు. బీసీలకు ఏదైనా కొత్త పథకం ప్రారంభమైందంటే అది కేవలం టీడీపీ హయాంలోనే అని తెలిపారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో బీసీలు బాగా చదువుకునే అవకాశం వచ్చిందని అన్నారు. బీసీ బిడ్డలు నేడు వైద్యులుగా, ఇంజనీర్లుగా దేశవిదేశాల్లో స్థిరపడేందుకు చంద్రబాబు కృషి చేశారని అన్నారు. సమాజంలో మార్పు రావాలంటే ఒక్కరితో సాధ్యం కాదు… అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని ఏలే తరంలో మన బీసీలు కూడా ఉండాలని అన్నారు. రాష్ట్రంలోని బీసీలంతా అండగా నిలిచారు కాబట్టే టీడీపీ అభ్యర్థులకు రికార్డు మెజార్టీలు దక్కాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Also Read : Bandi Sanjay Slams : కేంద్ర సంక్షేమ పథకాల పేర్ల జోలికి వస్తే ఖబడ్దార్

Leave A Reply

Your Email Id will not be published!