Minister Ram Mohan Naidu : పీఎం, సీఎం కలిసిన ఏపీ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ....

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అభివృద్ధి పరుగులు పెడుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అటు ప్రధాని మోదీ, ఇటు సీఎం చంద్రబాబు ఇద్దరూ కలిసి ఏపీని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పటికే రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు, పోలవరం మెుదటి దశ పనుల కోసం రూ.12,567కోట్లు కేంద్రం ప్రకటించిందని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రానికి మూడు పారిశ్రామిక కారిడార్లు సహా ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు మోదీ సర్కార్ అండగా ఉన్నట్లు రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) చెప్పుకొచ్చారు.

Minister Ram Mohan Naidu Comment

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) మాట్లాడుతూ..” శ్రీకాకుళం జిల్లా నుంచి నాకు కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చింది. ఈ ఐదేళ్లపాటు జిల్లా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. జిల్లాలో ఒక పోర్టు, ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తా. టెక్కలి మూలపేటలో సంవత్సరంలో పోర్టు పనులు పూర్తి చేస్తాం. నాకు కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే.. బాబాయి(కింజరాపు అచ్నెనాయుడు)కి ఏపీ మంత్రిగా అవకాశం వచ్చింది. ఇద్దరం కలిసి జిల్లాని అభివృద్ధి చేస్తాం. శ్రీకాకుళం జిల్లా ప్రజల అభిమానం వల్లే మేము ఈ స్థాయికి వచ్చాం. ప్రతీ నెలా తెల్లవారుజామునే మీ ఇంటికి వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. మాజీ సీఎం ఎన్టీఆర్ ఆనాడు మత్స్యకారులకు అనేక విధాలుగా సహాయం చేశారు. అదే విధంగా సీఎం చంద్రబాబు ముందుకు వచ్చారు. ప్రతీ ఒక్కరినీ ఆయన ఆదుకునేందుకు ముందుంటారు. విజయవాడ వరదల సమయంలో ముఖ్యమంత్రి చేసిన సేవలు, తీసుకున్న చర్యలు అద్భుతంగా పని చేశాయి. వరదలకు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్లే పెద్దఎత్తున ప్రాణనష్టం తప్పింది.

గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది. జగన్ హయాంలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వేయలేదు. ముఖ్యంగా డీఎస్సీ అభ్యర్థులకు గత పాలకులు తీవ్రనష్టం చేకూర్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజే 16వేల పోస్టుల భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు డిఎస్సీ నోటిఫికేషన్‌పై మెుదటి సంతకం చేశారు. గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు మూసి వేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక 100రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 178 అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. హుద్‌హుద్ తుపాన్ బాధితులకూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్లు నిర్మించాం. సూపర్ సిక్స్‌లో భాగంగా దీపావళి రోజు నుంచీ గ్యాస్ కనెక్షన్లు అందిస్తాం” అని చెప్పారు.

Also Read : Perni Nani : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన పేర్ని నాని

Leave A Reply

Your Email Id will not be published!