Minister Ram Mohan Naidu : వైసీపీ శాంతి భద్రతలకు భంగం కలిగించే కుట్ర చేస్తుంది
దివంగత ఎన్టీఆర్ ఆశయ సాధనకు ఎర్రన్న పనిచేశారని తెలిపారు...
Ram Mohan Naidu : ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 సంవత్సరాలు వెనక్కు వెళ్లిపోయిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. జగన్ అహంకారం లెక్కలేనితనం కారణంగానే ప్రజలు ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారని.. అయినా ఆ పార్టీ ధోరణిలో ఇంకా మార్పు రావటం లేదని అన్నారు. ప్రజలు ఛీకొట్టినా వైసీపీ(YSRCP) నేతలకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శలు చేశారు. ఇవాళ(ఆదివారం) స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 68వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu), జిల్లా టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఎర్రన్న ఆశయాలు కొనసాగిస్తామని అన్నారు. ఎర్రన్నాయుడు బడుగు బలహీన వర్గాల నాయకుడని రామ్మోహన్ నాయుడు కొనియాడారు.
Ram Mohan Naidu Slams YSRCP
దివంగత ఎన్టీఆర్ ఆశయ సాధనకు ఎర్రన్న పనిచేశారని తెలిపారు. నిరంతరం పార్టీ అభివృద్ధికి కృషి చేశారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గుర్తుచేశారు. వైసీపీని ప్రజలు మర్చిపోయారు…కాబట్టే ఏదో ఒక హంగామా చేస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటం చేయటం లేదని అన్నారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా రాలేదని, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వలేదని పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేశారని ధ్వజమెత్తారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మను గెలిపించాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు.
ప్రజలుకూటమి ప్రభుత్వ కార్యక్రమాలను స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పెద్దఎత్తున జరుగుతుందని చెప్పుకొచ్చారు. మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికు ఎన్నికల కోడ్ తెలియదా అని ప్రశ్నించారు. ఏపీలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి వైసీపీ కుట్ర పన్నిందని.. ఆ పార్టీ కుట్రలను సాగనివ్వమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.
Also Read : PM Modi Mann Ki Baat : మోదీ మన్ కి బాత్ లో ఇస్రో మహిళా శాస్త్రవేత్తలపై ప్రశంసలు