Minister Ram Mohan : విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలును ప్రారంభించిన కేంద్రమంత్రి
భారత దేశంలోని మూడు రాష్ట్ర రాజధానుల్లో ఈ ట్రైన్ ఆగుతుందని వివరించారు...
Minister Ram Mohan : విశాఖ రాయపూర్ (దుర్గు ) వందేభారత్ రైల్‌ను ఈరోజు(సోమవారం) విశాఖ రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Minister Ram Mohan) ప్రారంభించారు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ సర్వీస్‌గా విశాఖ – రాయ్‌పూర్ వందే భారత్ ట్రైన్ తిరగనున్నది. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… విశాఖపట్నం మీదుగా నడిచే నాల్గో వందే భారత్ రైలు ఇదని చెప్పారు. రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖలో మూడు వందే భరత్ రైళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. దేశంలో పూర్తి కెపాసిటీతో నడుస్తున్న రైల్ విశాఖ- సికింద్రాబాద్ వందే భారత్ అని అన్నారు. ఇక విశాఖ- రాయాపూర్ వందే భారత్ మూడు రాష్ట్రాల నుంచి నడుస్తోందని వివరించారు. పూర్తిగా గిరిజన ప్రాంతాల్లో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదని తెలిపారు. పార్వతీ పురంలో స్టాప్ ఏర్పాటు చేశామని అన్నారు.
Minister Ram Mohan Naidu Inaugurates
భారత దేశంలోని మూడు రాష్ట్ర రాజధానుల్లో ఈ ట్రైన్ ఆగుతుందని వివరించారు. 14లక్షల ఉద్యోగులు ఉన్న సంస్థ రైళ్లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అతి త్వరలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌కు భూమి పూజ చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
Also Read : Vemula Prashanth Reddy : రేవంత్ సర్కార్ తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టింది