RK Roja AP CM Cup : ఏపీ సీఎం కప్ కు ఘనంగా ఏర్పాట్లు – రోజా
ఏపీ టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి
RK Roja AP CM Cup : ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడాధికారిక సంస్థ (ఏపీ శాప్) ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టామన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతిభావంతులైన వారు ఎందరో ఉన్నారని, వారికి ఒక వేదిక కల్పించేందుకు శాప్ కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం ఆదేశాల మేరకు ఈ ఏడాది 2023లో ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రంగా భావించే తిరుపతిలో ఏపీ సీఎం కప్ పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆర్కే రోజా(RK Roja AP CM Cup).
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు తాను, డిప్యూటీ సీఎం, తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈక ఏపీ సీఎం కప్ ను నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నట్లు వెల్లడించారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. ఈ రాష్ట్ర స్థాయి ఏపీ సీఎం కప్ పోటీలు మే 1 నుంచి మే 5 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు హాజరవుతారని వెల్లడించారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి.
ఇక క్రీడా రంగానికి సంబంధించి 14 క్రీడా విభాగాలలో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్ , బాస్కెట్ బాల్ , బాక్సింగ్ , ఫుట్ బాల్ , హ్యాండ్ బాల్ , కబడ్డీ, ఖోఖో , హాకీ, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాలలో పోటీలు ఉంటాయని స్పష్టం చేశారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి(RK Roja).
Also Read : తిరుపతిలో మే 1 నుంచి ఏపీ సీఎం కప్