Basara IIIT Protest : విద్యార్థుల పోరాటం దిగొచ్చిన ప్రభుత్వం
మంత్రి సబిత హామీతో ఆందోళన విరమణ
Basara IIIT Protest : చదువుల సరస్వతి బాసర సాక్షిగా త్రిబుల్ ఐఐఐటీ(Basara IIIT Protest) విద్యార్థులు సాగించిన పోరాటానికి ఎట్టకేలకు కేసీఆర్ ప్రభుత్వం దిగి వచ్చింది. బుజ్జగింపులు పని చేయలేదు.
పోలీసులను మోహరించినా బెదరలేదు. తీసి వేస్తామని, కేసులు నమోదు చేస్తామని, చదవకుండా చేస్తామని చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు చేసిన హుకూంలు పని చేయలేదు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో విద్యార్థులతో చర్చలకు దిగాల్సిన పరిస్థితి తనంతకు తానే తెచ్చుకుంది సర్కార్. ఇది బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట అని వీఆర్ఎస్ తీసుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పేర్కొన్నారు.
ఏడు రోజుల పాటు వేలాది మంది విద్యార్థులు(Basara IIIT Protest) రోడ్డెక్కారు. వర్షాలు పడినా ఓర్చుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత దాకా కదిలేది లేదంటూ నిరసన చేపట్టారు. ప్రభుత్వం తరపున విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసరకు చేరుకున్నారు.
అర్ధరాత్రి దాకా విద్యార్థులతో చర్చించారు. విద్యార్థులు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లను నెల రోజుల్లోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీడియాను వెళ్లకుండా అడ్డుకున్నారు.
మంత్రితో పాటు ఆర్జీయూకేటీ ఇన్ చార్జి వీసీ రాహుల్ బొజ్జా , విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కలెక్టర్ అలీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్ , డైరెక్టర్ సతీష్ కుమార్ విద్యార్థులతో చర్చలు జరిపారు.
అర్ధరాత్రి దాకా చర్చలు జరిగాయి. విద్యార్థులపై నిర్బంధం కొనసాగింది. కానీ కొందరి ప్రయత్నం వల్ల సోషల్ మీడియాలో బాసర హాట్ టాపిక్ గా మారింది. విద్యార్థులు పాడిన పాటలు వైరల్ అయ్యాయి.
మరో వైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గోడ దూకి విద్యార్థులతో మాట్లాడడం కలకలం రేపింది.
Also Read : డిమాండ్స్ తీర్చే దాకా పోరాటం ఆగదు