Minister Satya Kumar Yadav: విశాఖ జిల్లాలో ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన

విశాఖ జిల్లాలో ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన

Satya Kumar Yadav: సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో ఏపీలో వైద్యరంగంలో అనేక సంస్కరణలు తెచ్చామని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav) తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ. 2 వందల కోట్లు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉన్న గత ప్రభుత్వంలో కేవలం రూ.38 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని చెప్పుకొచ్చారు. విశాఖ జిల్లా పర్యటనలో బాగంగా మంగళవారం విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్‌ లో ఆధునిక వసతులతో కూడిన రూ.30 కోట్లతో నిర్మించిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ భవనాలు ఏకడమిక్ బ్లాక్‌ను, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు.

Minister Satya Kumar Yadav Visit

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు, ఎంపీ శ్రీ భరత్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాస రావు, డిప్యూటీ మేయర్ నల్లి గోవింద, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ లో భాగంగా రూ.1.38 కోట్ల వ్యయంతో పెదవాల్తేరు పోలమాంబ గుడి సమీపంలోని భానోజీనగర్ వద్ద నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ (Satya Kumar Yadav) మీడియాతో మాట్లాడుతూ… 2020లో నేషనల్ హెల్త్ అర్బన్ 15వ ఫైనాన్స్ కమిషన్ కింద 520 యూపీహెచ్సీలు మంజూరు చేశామని గుర్తుచేశారు. ప్రస్తుత యూపీహెచ్సీని కోటి 50 లక్షల రూపాయలతో నిర్మించామని తెలిపారు. విశాఖకి 48 యూపీహెచ్ఎల్‌లు మంజూరయ్యాయని వివరించారు. స్టేట్ క్యాన్సర్ సెంటర్ 2018లో మంజూరయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు. సంవత్సరంలో ఏడు కోట్ల 48 లక్షల ఓపీలు నమోదు అవుతున్నాయని వెల్లడించారు. గత సంవత్సర కాలంగా 17శాతం ఐపీ సేవలు పెరిగాయని… 7శాతం డయగ్నోస్టిక్ టెస్టులు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో ఓపీ, ఐపీ సేవలు భారీగా పెరిగాయని అన్నారు. సూపర్ స్పెషాలిటీలో 59శాతం వేకెన్సీలు ఉన్నాయని చెప్పారు. టెలి మానస్‌లో భాగంగా మానసిక కౌన్సెలింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.

Also Read : Aparesh Kumar Singh: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌కుమార్‌ సింగ్‌

Leave A Reply

Your Email Id will not be published!