Minister Satyakumar: పీపీపీ విధానంపై వైఎస్ జగన్ కు మంత్రి సత్యకుమార్ సవాల్
పీపీపీ విధానంపై వైఎస్ జగన్ కు మంత్రి సత్యకుమార్ సవాల్
Minister Satyakumar : పీపీపీ విధానంపై చర్చకు రావాలనే తన ప్రతిపాదనకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకూ ఎందుకు స్పందించలేదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar) ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని అహర్నిశలూ అనేక వ్యయప్రయాసలకు పాటుపడుతున్న జగన్ ఇకనైనా చర్చకు రావాలని ఛాలెంజ్ విసిరారు. అందరినీ కొంతకాలం జగన్ మోసగించొచ్చు కానీ పూర్తి కాలం మోసగించలేరని మండిపడ్డారు. శనివారం అమరావతి వేదికగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
Minister Satyakumar Key Comments
పీపీపీ విధానంలో కొన్ని వైద్య కళాశాలల అభివృద్ధి, నిర్వహణ పట్ల తన వాదనకు తన పార్టీలోనే మద్దతు లేదని గ్రహించిన జగన్ కి అభినందనలు. జగన్ ఆదేశాల మేరకు వైసీపీ శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమాల వైఫల్యం ద్వారా ఈ మేరకు ఆయనకు జ్ఞానోదయం కలగడం మంచి పరిణామమని చెప్పుకొచ్చారు. తన పార్టీ నాయకులు, కార్యకర్తలే జగన్ రెడ్డి వాదాన్ని సమర్ధించకపోవడంతో నిరసన కార్యక్రమం నీరసించిపోయిందని విమర్శించారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
పులివెందులలో కూడా జగన్ రెడ్డి ఆశించిన మేరకు మద్దతు లేకపోవడం ఆయన వాదనలోని డొల్లతనాన్ని బహిర్గతం చేసిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ కాలేజీల్లో వార్షిక ఫీజును రూ.12 లక్షలు, రూ.20 లక్షలుగా పెంచి రాజకీయ దురుద్దేశంతో నేడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడంతో జగన్ ద్వంద ప్రమాణాలను ప్రజలు అర్ధం చేసుకోవడంతో వారి నిరసన ఫ్లాప్ అయ్యిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar) విమర్శించారు.
జగన్ చెప్పిన 17 మెడికల్ కాలేజీలు పచ్చి అబద్ధం – మంత్రి సంధ్యారాణి
వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చినట్లు జగన్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధమని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. ఆయన హయాంలో రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని చెప్పారు. రూ.1,451 కోట్లు పూర్తిగా కేంద్ర నిధులే అని.. రాష్ట్రం వాటా సున్నా అని పేర్కొన్నారు. పులివెందుల సహా పలు కాలేజీలకు ఎన్‌ఎంసీ అనుమతుల రద్దుకు జగన్ వైఫల్యమే కారణమన్నారు.
‘‘టీడీపీ పాలనలో మొత్తం 28 మెడికల్ కళాశాలలు స్థాపించాం. మా పార్టీ హయంలోనే నిమ్స్, స్విమ్స్, ఎయిమ్స్, జినోమ్ వ్యాలీ, మెడ్‌టెక్ సిటీ వంటి సూపర్ స్పెషాలిటీ సంస్థలు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా సీఎం చంద్రబాబు సంకల్పం. పీపీపీ మోడల్‌లో అధునాతన వైద్య సదుపాయాలు కల్పిస్తాం’’ అని సంధ్యారాణి అన్నారు.
Also Read : Nara Lokesh: పరకామణిలో వైసీపీ నాయకులు రూ.100 కోట్లు కొల్లగొట్టారు – మంత్రి లోకేశ్
