Minister Savita: పులివెందుల ఎన్నికపై జగన్ భయపడుతున్నాడు – మంత్రి సవిత
పులివెందుల ఎన్నికపై జగన్ భయపడుతున్నాడు - మంత్రి సవిత
Minister Savita : పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని మంత్రి సవిత (Minister Savita) అన్నారు. తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు చించడం వైసీపీ నాయకుల అవివేకానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. పోలీసులను అసభ్యకరంగా మాట్లాడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వైసీపీకి పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోతామని భయం పట్టుకుందని… అందుకే ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వైసీపీకి పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోతామని భయం పట్టుకుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.
Minister Savita Slams YS Jagan
వైసీపీ నాయకులు పులివెందుల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు పేర్కొన్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై జగన్ దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులు, ఘర్షణలు చూసి తన తండ్రి వైఎస్ వివేకా జయంతికి పులివెందులకు రావాలంటేనే సునీత భయపడుతోందన్నారు. వరసగా మూడ్రోజులపాటు జరుగుతున్న దాడులన్నీ వైసీపీ వారే చేసుకొని ఆ నెపాన్ని టీడీపీపై వేసి ఉంటారని సునీత ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. దీన్ని బట్టే పులివెందులలో వైకాపా నేతల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ‘‘పులివెందులలో వైసీపీ నాయకులు ఓడిపోతారనే భయంతోనే ధర్నాలు, పోలీసులను బెదిరించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొంటాం. జగన్ రప్పా.. రప్పా అనే వ్యాఖ్యలు, వైకాపా నేతలు మాట్లాడుతున్న అసభ్యకరమైన మాటలు రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. సూపర్‌సిక్స్ పథకాలు, ఏడాది నుంచి పులివెందులలో ప్రశాంతతతో ఇక్కడి రెండు స్థానాలు తెదేపా గెలుచుకుంటుంది’’అని మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు.
Also Read : YS Sharmila: వైసీపీకి, వైఎస్సార్ కు సంబంధం లేదు – షర్మిల
