Minister Seethakka Sensational : లక్ష మంది మహిళలతో ఉమెన్స్‌ డే రోజున మీటింగ్ – మంత్రి సీతక్క

లక్ష మంది మహిళలతో ఉమెన్స్‌ డే రోజున మీటింగ్ - మంత్రి సీతక్క

Minister Seethakka : మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలంగాణా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దాసరి సీతక్క తెలిపారు. మహిళా దినోత్సవం రోజున సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో సుమారు లక్ష మంది మహిళలతో సభ నిర్వహిస్తామన్నారు. ఈ సభలో ఇందిరా మహిళా శక్తి పాలసీని సీఎం రేవంత్‌ రెడ్డి విడుదల చేస్తారని చెప్పారు. నారాయణపేట జిల్లా మాదిరిగా మిగతా 31జిల్లాల్లోనూ పూర్తిగా మహిళలే పెట్రోలు బంకులు నిర్వహించేలా చమురు సంస్థలతో ఆ రోజున ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని సీతక్క(Minister Seethakka) చెప్పారు. మహిళా దినోత్సవం నిర్వహణ, బహిరంగ సభ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహణకు తీసుకోవాల్సిన బందోబస్తుపై అధికారులకు కీలక సూచనలు చేసారు.

Minister Seethakka Meeting

సమీక్ష అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ… మహిళా సంఘాల కోసం 32 జిల్లాల్లో 64 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను సీఎం వర్చువల్ గా ప్రారంభిస్తారన్నారు. వడ్డీలేని రుణాల చెక్కులను సీఎం పంపిణీ చేస్తారని తెలిపారు. ఏడాది కాలంలో ప్రమాదవశాత్తూ మరణించిన 400 మంది మహిళలకు రూ.40 కోట్ల బీమా చెక్కులను సీఎం రేవంత్‌ ఇవ్వనున్నట్లు సీతక్క వివరించారు. పట్టణాల్లో మహిళా సంఘాలను బలోపేతానికి సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని.. సెర్ప్, మెప్మాల‌ను ఒకే గొడుగు కింద‌కు తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. మహిళను ఆర్ధికంగా బలోపేతం చేసే విధంగా పలు కార్యక్రమాలను ఈ వేదిక ద్వారా శ్రీకారం చుట్టనున్నట్లు ఆమె స్పష్టం చేసారు.

Also Read : IAS Mahabharathi : పోక్సో కేసుపై తమిళనాడు కలెక్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!