Minister Srinivasa Varma: వైజాగ్ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు ఢోకా లేదు – కేంద్ర మంత్రి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు ఢోకా లేదు - కేంద్ర మంత్రి
Srinivasa Varma : విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నష్టాల బారి నుంచి లాభాల బాట పట్టించేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (Srinivasa Varma) తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారంటూ బాధ్యతారహిత పార్టీల నాయకులు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏలూరులో మంత్రి శ్రీనివాసవర్మ మీడియాతో మాట్లాడారు.
Union Minister Srinivasa Varma Key Comments on Vizag Steel Plant
ఈ సందర్భంగా నష్టాల్లో ఉన్న ప్లాంట్‌ను కాపాడేందుకే కేంద్రం రూ.11,500 కోట్లు ఇచ్చింద . స్టీల్ ప్లాంట్ భవిష్యత్ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదు. కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకుల సహకారంతో ప్లాంట్‌ను లాభాల బాట పట్టిస్తాం. పరిశ్రమ ప్రయోజనాల కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. జీఎస్టీ తగ్గిస్తూ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో విప్లవాత్మక మార్పులు వస్తాయి. సాధారణ ప్రజల జీవన స్థితిగతుల్లో సమూల మార్పులు రానున్నాయి. రెండు స్లాబ్‌లతో రానున్న రోజుల్లో మరింత వెసులుబాటు కలగనుంది. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వేలు, జాతీయరహదారులపై ప్రత్యేక దృష్టి సారించాం. 165వ జాతీయ రహదారి విస్తరణకు రూ.3,200 కోట్లతో డీపీఆర్ సిద్ధమైంది. త్వరలో నరసాపురం – చెన్నై వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. నరసాపురం – అరుణాచలం ఎక్స్‌ప్రెస్‌ను రెగ్యులరైజ్ చేస్తాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా కలెక్టరేట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’’ అని శ్రీనివాసవర్మ తెలిపారు.
Also Read : Amit Shah: హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా
