Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Minister Uttam Kumar Reddy : తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రమాదం తప్పింది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌… కోదాడలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు… హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్‌ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Minister Uttam Kumar Reddy Comment

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. హుజూర్‌నగర్ మండలం మేళ్లచెరువులో హెలికాఫ్టర్ ల్యాండ్ కావాల్సి ఉండగా… వాతావరణశాఖ అధికారుల సూచన మేరకు అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపథ్యంలో పైలట్ అప్రమత్తమయ్యారు. దీనితో హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అనంతరం, మంత్రి ఉత్తమ్ కుమార్‌.. కోదాడ నుంచి హుజూర్ నగర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు.

Also Read : KTR: కేసీఆర్‌ కు కాళేశ్వరం కమీషన్ నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!