Minister Uttam Kumar Reddy: బనకచర్లపై మా వాదనతో కేంద్రం ఏకీభవించింది – మంత్రి ఉత్తమ్

బనకచర్లపై మా వాదనతో కేంద్రం ఏకీభవించింది - మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy : ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాయని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విమర్శించారు. మంగళవారం ప్రజా భవన్‌లో బనకచర్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… కృష్ణా నదిలో ఏపీకి ఎక్కువ నీళ్లు ఇచ్చేందుకు గత ప్రభుత్వం ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు.

Minister Uttam Kumar Reddy Comments

గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రయత్నాలు మొదలయ్యాయిని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా తమ ప్రభుత్వంపై దుష్ప్రాచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మండిపడ్డారు. అయితే బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు తాము చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. తమ వాదనతో కేంద్రం ఏకీభవించిందని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం పంపిన బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపిందని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

బనకచర్ల విషయంలో కాంగ్రెస్‌ మొద్దునిద్రను లేపింది – బీఆర్ఎస్ హరీశ్‌రావు

ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ మొద్దునిద్రను లేపింది, ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరగని పోరాటం చేసింది బీఆర్ఎస్ నేనని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గోదావరి-బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌పై హరీశ్‌రావు ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. పాత అబద్ధాలనే మళ్లీ ప్రచారం చేస్తోన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అపెక్స్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఎందుకు అడగట్లేదని ప్రశ్నించారు. చంద్రబాబు పట్ల చూపుతున్న గురుభక్తికి ఇది నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో అన్యాయం చేస్తూనే, లెక్కకు మించి అబద్ధాలు ప్రచారం చేస్తూ.. బీఆర్ఎస్ పై చేస్తున్న రాజకీయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు.

Also Read : BV Pattabhiram: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ మృతి

Leave A Reply

Your Email Id will not be published!