Minister Vangalapudi Anitha: విధ్వంసం సృష్టించడానికి బోట్లతో వైసీపీ కుట్ర – హోం మంత్రి అనిత

విధ్వంసం సృష్టించడానికి బోట్లతో వైసీపీ కుట్ర - హోం మంత్రి అనిత

Vangalapudi Anitha: మాజీ ముఖ్యమంత్రి, వెస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టాలని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గత పదిరోజులుగా వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తే… దానిని నుండి ప్రజలను కాపాడటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనే బస చేసారని… ప్రజలకు అన్ని విధాలా సహాయం అందిస్తుంటే… మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం విష ప్రచారంతో ప్రజల్లో అశాంతిని రేకెత్తిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

Minister Vangalapudi Anitha..

మంగళవారం విశాఖపట్నంలో హోంమంత్రి అనిత(Vangalapudi Anitha) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ… జగన్ రెండుసార్లు బయటికి వచ్చి తమ ప్రభుత్వంపై బురద జల్లి వెళ్లిపోయారని ఆరోపణలు చేశారు. ప్రకాశం బ్యారేజీకి పూర్తిస్థాయిలో వరద చుట్టూ ముడుతుంటే, దానిని కూడా డిస్ట్రబ్ చేయడానికి, విధ్వంసం చేయడానికి జగన్, వైసీపీ నేతలు ప్రయత్నం చేశారని విమర్శించారు. ఏపీలో విధ్వంసం సృష్టించడానికి బోట్లను, వదిలిపెట్టారని ఇరిగేషన్ అధికారులే చెబుతున్నారని అన్నారు. పిల్లర్లను ఢీ కొట్టి ప్రమాదం జరిగితే, కొన్ని వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉద్దండ రాయపురంలో ఉన్న బోట్లు ఇక్కడికి ఎలా వచ్చాయని మంత్రి అనిత(Vangalapudi Anitha) ప్రశ్నించారు. ఈరోజు వరకు బోట్లు పోయాయని ఎవరు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. వైసీపీ నేతలు నందిగాం సురేష్, తలశిల రఘురాం అనుచరులకు చెందిన బోట్లతోనే ఈ కుట్రకు పాల్పడడ్డారని ఆరోపణలు చేశారు. క్రిమినల్ మైండ్ ఉన్న నాయకుడు ప్రజలు కోసం ఆలోచించరు అనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేషాలు వేసిన అవి వర్కౌట్ కాలేదని అన్నారు. విపత్కర సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూడటం దారుణమని అన్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చినప్పటికీ జగన్‌కు ఇంకా బుద్ధి రావడం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశద్రోహం కేసు జగన్ మోహన్ రెడ్డిపై పెట్టాలని అన్నారు. సమాజంలో తిరిగే అర్హత ఆయనకి లేదని హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు.

Also Read : Operation Bhediya: కొనసాగుతున్న ఆపరేషన్‌ భేడియా ! పట్టుబడిన ఐదో తోడేలు

Leave A Reply

Your Email Id will not be published!