Minister Vangalapudi Anitha : అశోక్ గజపతిరాజు ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అనిత

అశోక్ గజపతిరాజు ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అనిత

Vangalapudi Anitha : నీతి , నిజాయితీ, విలువలు, ఆదర్శం, కలిగిన అశోక్ గజపతిరాజు లాంటి వ్యక్తిని గోవా గవర్నర్ గా నియమించడం అభినందనీయమని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు. అజాత శత్రువుగా, నిబద్ధత కలిగిన పార్టీ సభ్యుడిగా, నిజాయితీ గల మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు లాంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం గవర్నర్ గా నియమించడం హర్షనీయమన్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా గోవా గవర్నర్ గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజు బంగ్లాకు వెళ్ళి… అతని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Home Minister Vangalapudi Anitha Meet

ఈ సందర్భంగా మంత్రి అనిత (Vangalapudi Anitha) మాట్లాడుతూ… గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నామినేట్ అవడం చాలా సంతోషంగా ఉంది. విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్ర, దేశ వ్యాప్తంగా కూడా అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) సేవలు విస్తరించాయి అనడానికి ఇదొక ఉదాహరణ. రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తికి అయిన ఏదో ఒక చిన్న నింద అయినా ఉంటుంది. కానీ అశోక్ గజపతిరాజు మాత్రం కడిగిన ముత్యంలాంటి వ్యక్తి. నీతికి,నిజాయితీగా విలువులకు మారు పేరు అశోక్ గజపతిరాజు. చిన్న రికమండేషన్ చెయ్యమని ఎవ్వరైనా వెళ్ళినా, మీకు రికమండేషన్ చేస్తే, ప్రజాస్వామ్యంలో మరొక వ్యక్తి నష్టపోతారని చెప్పిన ఏకైక వ్యక్తి అశోక్ గజపతిరాజు మాత్రమే. అశోక్ గజపతిరాజు గత యాభై ఏళ్లుగా విజయనగరం జిల్లాకు అనేక సేవలు చేశారు. ఎంతో మందికి సేవలు అందిస్తూ, మాన్సాస్ ట్రస్ట్ ను నడుపుతున్న మంచి మనసున్న వ్యక్తి. ఆయన వారసత్వంగా ఆయన కుమార్తెను ఎమ్మెల్యేలగా గెలిపించారు.సమాజానికి మంచి చేయాలని ఆలోచనోతే ఆయన కుమార్తె ను కూడా రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు.

అజాత శత్రువుగా పేరు పొందిన వ్యక్తి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju). అలాంటి వ్యక్తిని గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసు. ఆ రోజు అశోక్ చాలా బాధపడ్డారు. నేనే స్వయంగా దగ్గర నుండి చూసాను. ఏదో రకంగా ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. జగన్ అశోక్ పై కక్ష కడితే- చంద్రబాబు సేవలను గుర్తించారు. లెజెండరీ పర్సనాలిటీ అయినటువంటి అశోక్ ను కూడా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టారు. యుద్ధానికి కూడా ఒక సమయం ఉంటుంది. కానీ జగన్ చేసే యుద్ధానికి సమయం లేదు.రాత్రి పగలు అని తేడా లేకుండా కక్షలు కడుతూ కేసులు పెట్టీ వేధించే వాడు. అందుకే 151 నుండి 11 సీట్లకు దిగజారాడు. ఎంతో మంది సీనియర్లను టచ్ చేశాడు… అందుకే పాతాళానికి పడిపోయాడు. విలువలు, ఆదర్శం, నీతి , నిజాయితీ కలిగిన అశోక్ గజపతిరాజు లాంటి వ్యక్తిని చూసి ఎంతో నేర్చుకున్నామన్నారు.

Vangalapudi Anitha – స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీలో పాల్గొన్న మంత్రి అనిత

ప్లాస్టిక్ ప్రతి ఒక్కరి నిత్య జీవితం లో భాగమైపోయిందని , అయితే ప్లాస్టిక్ తో మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామని, ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర లో భాగంగా శనివారం గంటస్థంభం నుండి బాలాజీ కూడలి వరకు జరిగిన ర్యాలీ లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం బాలాజీ కూడలి లో జరిగిన కార్యక్రమం లో మంత్రి అనిత పాల్గొని ప్రసంగించారు. ఈ మూడవ శనివారం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం అనే నినాదం తో ప్రభుత్వం రాష్ట్రమంతటా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.

ప్లాస్టిక్ వినియోగం పై ఒక్క రోజులో మార్పు రాదనీ, ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయం చూడాలని తెలిపారు. డ్వాక్రా, మెప్మా సంఘాల ద్వారా పేపర్ , జనప నార , కాటన్ తో బాగ్ లను తయారు చేసే యూనిట్ల ను స్థాపించేలా శిక్షణ కు ఇవ్వాలని తెలిపారు. జిల్లాలో చిన్న చిన్న యూనిట్లను స్థాపించడం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా ప్లాస్టిక్ నియంత్రణ కు కూడా కృషి జరుగుతుందని అన్నారు. చెత్త నుండి సంపదను సృష్టించే ముఖ్యమంత్రి రాష్త్రం లో పని చేయడం మన అదృష్టమని, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి చెత్త నిర్వహణ కు రాష్త్ర వ్యాప్తంగా కృషి చేస్తున్నారని తెలిపారు. తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు గా డిస్పోజ్ చేయాలనీ ఇంటి నుండే చెత్త నిర్వహణ జరగాలని తెలిపారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్, డి.సి.ఎం.ఎస్. చైర్మన్ గొంప కృష్ణ , మున్సిపల్ కమీషనర్ నల్లనయ్య, సి.పి.ఓ బాలాజీ, ఆర్.డి.ఓ కీర్తి, కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also Read : Anand Mahindra: లోకేశ్‌ పోస్ట్‌ కు పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా ఆశక్తికరమైన రిప్లై

Leave A Reply

Your Email Id will not be published!