Minister Vangalapudi Anitha: పోలీసులకు, ఖైదీలకు, ఆటో డ్రైవర్ కు రాఖీ కట్టిన హోం మంత్రి అనిత
పోలీసులకు, ఖైదీలకు, ఆటో డ్రైవర్ కు రాఖీ కట్టిన హోం మంత్రి అనిత
Vangalapudi Anitha : రక్షాబంధన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టి సోదర భావాన్ని వ్యక్తం చేశారు. విశాఖ ఎంవీపీ కాలనీ నుంచి ఉషోదయ జంక్షన్ వరకు ఆటోలో ప్రయాణించిన హోంమంత్రి ఆటో డ్రైవర్ గిరీశ్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించి, రాఖీ కట్టారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూనే అంకితభావంతో విధులు నిర్వహిస్తుండడంపై అభినందించారు. ఆయనకు ధైర్యం చెప్పారు. కానిస్టేబుల్ పూర్తి సాయం అందిస్తామని హోంమంత్రి అనిత అన్నారు.
Vangalapudi Anitha – విశాఖ సెంట్రల్ జైలును సందర్శంచిన హోం మంత్రి అనిత
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) శనివారం విశాఖపట్నంలోని కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె జైల్లోని యువ ఖైదీలకు రాఖీలు కట్టారు. మంత్రి అనిత మొత్తం 30 మంది ఖైదీలకు స్వయంగా రాఖీలు కట్టి,వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి రవాణాలో నిందితులుగా ఉన్న ఖైదీలకు అవగాహన కల్పించారు. తెలిసి తెలియని వయస్సులో ఈజీమనీ కోసం తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేస్తాయని చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మంచి–చెడులను యువత తెలుసుకోవాలన్నారు. యువతకు బంగారు భవిష్యత్తు ఉందని,దాన్ని నాశనం చేసుకోకూడదని సూచించారు. బ్రతకడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఖైదీల జీవితాల్లో మార్పు రావాలన్నారు. వచ్చే సంవత్సరం రాఖీ పండుగను మీ ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో జరుపుకునే స్థితికి చేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా జైళ్లశాఖ అధికారులకు కూడా రాఖీలు కట్టి సోదరీ స్నేహాన్ని పంచుకున్నారు. గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని ఆమె స్పష్టం చేశారు.
Also Read : CM Chandrababu: మళ్ళీ జన్మ ఉంటే గిరిజన ప్రాంతంలో పుట్టాలని కోరుకుంటా – సీఎం చంద్రబాబు
