Ministers: విశాఖ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు – ఇన్ ఛార్జ్ మంత్రి డోలా
విశాఖ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు - ఇన్ ఛార్జ్ మంత్రి డోలా
Ministers : సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు యోగాంధ్రలో భాగస్వాములై విజయవంతం చేసిన ప్రజలు, కూటమినేతలు, అధికారులకు విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శనివారం నాడు ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నెలరోజుల పాటు కూటమి నేతలు, అధికారులు రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి యోగాంధ్ర (Yogandhra) కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. ప్రజల సహకారం, అధికారులు, కూటమి నాయకుల సమన్వయంతో దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా విశాఖపట్నంలో (Visakhapatnam) నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే అరుదైన రికార్డు సాధించిందని కొనియాడారు.
అంతర్జాతీయ యోగా డే నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ (Minister Lokesh) కృషి ఆనిర్వచనీయమన్నారు. సముద్ర తీరాన మూడు లక్షల మందికి పైగా ఒకేసారి యోగాలో పాల్గొనడం దేశ చరిత్రలోనే చాలా అరుదైన ఘటనన్నారు. యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణ గిన్నిస్ బుక్ రికార్డుతో రాష్ట్ర ఖ్యాతి విశ్వవ్యాప్తమైందన్నారు. స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులైన విశాఖ ప్రజలకు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
Ministers : విశాఖలో యోగాంధ్ర.. నాకే మొదటి బహుమతి ఇవ్వాలి: అచ్చెన్నాయుడు
విశాఖలో జరిగిన ‘యోగాంధ్ర’ (Yogandhra) కార్యక్రమంపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘యోగా చేయగలవా అని సీఎం చంద్రబాబు నన్ను అడిగారు. చేయలేకపోతే విశాఖ ఈవెంట్కు రావొద్దని చెప్పారు. ఆయన మాటల్ని పట్టుదలగా తీసుకుని యోగాసనాలు వేశా. ఈ ఈవెంట్లో వ్యక్తిగతంగా బహుమతులు ఏవైనా ఇస్తే.. నాకే మొదటి బహుమతి ఇవ్వాలి’’ అని అచ్చెన్నాయుడు అన్నారు.
యోగాంధ్ర-2025 విజయవంతం కావడంపై మంత్రి కొండపల్లి హర్షం
విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రజల సహకారంతో విజయవంతం కావడంపై రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. యోగాంధ్ర – 2025 (Yogandhra 2025) (యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మే 21 నుండి జూన్ 21 ప్రపంచ యోగ దినోత్సవం వరకు నెల రోజుల పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాయని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం గిన్నీస్ రికార్డు సాధించడం సంతోషంగా ఉందన్నారు.
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలిగించే యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నదే తన ఆకాంక్ష అని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు. భారీ ఎత్తున ప్రజల నుండి స్పందన రావడం, విశాఖలోని ఆర్ కే బీచ్ నుండి భోగాపురం వరకు దాదాపు 3 లక్షలకు పైగా ప్రజలు ఒకే వేదికపై యోగా అభ్యసనం చేయడం అసాధారణమైన విషయమన్నారు. యోగా మన వారసత్వ సంపద అని గుర్తుచేశారు. ప్రపంచానికి మన దేశం అందించిన గొప్ప వరం యోగా అని కీర్తించారు. ప్రస్తుత జీవనశైలికి, సమస్యలకు యోగా చక్కని పరిష్కార మార్గమని సూచించారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ వేదికపై మరోసారి ఇనుమడింపజేసిందన్నారు. ఇదొక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సహచర మంత్రులు, అధికార యంత్రాంగం,ప్రజలతో కలిసి యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Also Read : CM Chandrababu: యోగా డే సూపర్ హిట్ – ముఖ్యమంత్రి చంద్రబాబు
