Miss World 2025 : చార్మినార్, చౌముల్లా ప్యాలెస్ వద్ద సందడి చేసిన అందాల భామలు

చార్మినార్, చౌముల్లా ప్యాలెస్ వద్ద సందడి చేసిన అందాల భామలు

Miss World : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మిస్ వరల్డ్ 2025(Miss World)’ పోటీలలో పాల్గొనడానికి సుమారు 190 దేశాల నుండి అందాల భామలు నగరారికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మిస్ వరల్డ్ 2025’ పోటీలలో పాల్గొనడానికి వచ్చిన అందాల భామలు మంగళవారం చార్మినార్ దగ్గర సందడి చేశారు. చుడీ బజార్‌ లో ఎంపిక చేసిన కొన్ని షాపులలో గాజులు, ముత్యాలహారాలు, అలంకరణ వస్తువుల షాపింగ్ చేశారు. అనంతరం చార్మినార్ నుంచి హెరిటేజ్ వాక్ చేసారు. ఆ తరువాత చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… కుటుంబ సమేతంగా చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఇక్కడే మిస్ వరల్డ్ 2025(Miss World) కంటెస్టెంట్లకు డిన్నర్ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా తెలంగాణ పర్యాటక ప్రాంతం గురించి తెలిపే సినిమాను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చార్మినార్, చౌముల్లా ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.

Miss World Updates

ఈ సందర్భంగా చౌముల్లా ప్యాలెస్ అద్భుతంగా ఉందని, హైదరాబాద్ ఆతిథ్యం మమ్మల్ని మురిపిస్తోందని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తమ సంతోషన్ని వ్యక్తం చేశారు. ఇది ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి. ఈ పర్యటన జీవితాంతం గుర్తుంటుంది. తెలంగాణ జరూర్ ఆనా నినాదం మా దేశాల్లో వినిపిస్తామని వారు అన్నారు.

ఏమిటీ హెరిటేజ్‌ వాక్‌ ?

హైదరాబాద్‌ నగరం, చారిత్రక నేపధ్యం, సాంస్కృతిక వైవిధ్యం, శిల్పకళా సంపదకు ప్రసిద్ధి చెందింది. నగరంలోని వారసత్వ కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి, ‘ఫోరమ్‌ ఫర్‌ ఏ బెటర్‌ హైదరాబాద్‌‘ సంస్థ ఆధ్వర్యంలో హెరిటేజ్‌ వాక్‌ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నగరంలోని చారిత్రక కట్టడాలను సందర్శించి, వాటి వెనుక ఉన్న చరిత్రను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. హెరిటేజ్‌ వాక్‌లో భాగంగా, పాల్గొనేవారు సందర్శించే ప్రముఖ చారిత్రక కట్టడాలలో చార్మినార్, మక్కా మసీదు, చౌమహల్లా ప్యాలెస్, బద్షాహీ అషూర్‌ఖానా, ఖిల్వత్‌ ముబారక్, లాడ్‌ బజార్‌ వంటివి ఉన్నాయి. ఇవి హైదరాబాద్‌ నగర చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.సందర్శకులకు స్థానిక గైడ్‌ల ద్వారా ప్రతి కట్టడానికి సంబంధించిన చరిత్ర, శిల్పకళా విశేషాలు వివరిస్తారు.

Also Read : Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!