Missing Case: సికింద్రాబాద్ లో ఒకే కుటుంబంలో ఆరుగురు అదృశ్యం
సికింద్రాబాద్ లో ఒకే కుటుంబంలో ఆరుగురు అదృశ్యం
Missing Case : సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. న్యూ బోయిన్‌పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేశ్, ఉమా దంపతులుగా తెలుస్తోంది. వారి ముగ్గురు పిల్లలతోపాటు సంధ్యా అనే మరో కుటుంబ సభ్యురాలు కూడా కనిపించకుండా పోయారు. స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్‌గా మహేష్ పనిచేస్తున్నాడు.
Missing Case in Hyderabad
గురువారం మహేష్ ఇంటికి సంధ్యా వెళ్లింది. సంధ్యాతో పాటు అదే రోజు బయటకు వెళ్లి మహేష్, భార్య పిల్లలు తిరిగిరాలేదు. ఇంటి యజమాని సమాచారంతో పోలీసులకు మహేష్ బావ భిక్షపతి ఫిర్యాదు చేశాడు. భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు ఆటో బుక్ చేసుకుని బోయిన్‌పల్లి నుంచి ఎంజీబీఎస్ స్టేషన్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆరుగురి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరి మిస్సింగ్ సికింద్రాబాద్ లో మిస్టరీగా మారింది.
Also Read : MLC Elections: రసవత్తరంగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక !