Balineni Srinivasa Reddy : బాలినేని నిర్ణ‌యం క‌ల‌క‌లం

ఒంగోలుపై ఫోక‌స్ కేన‌న్న ఎమ్మెల్యే

Balineni Srinivasa Reddy : ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి ఉన్న‌ట్టుండి పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంపై ఫోక‌స్ పెట్టేందుకు తాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇటీవ‌లి కాలంలో తాను త‌రచూ అనారోగ్యానికి గుర‌వుతున్నాన‌ని, దీంతో ఎక్కువ స‌మ‌యం కేటాయించ లేక పోతున్న‌ట్లు తెలిపారు.

తాను ఎవ‌రినీ నిందించ ద‌ల్చు కోలేద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డికి(Balineni Srinivasa Reddy) మూడు జిల్లాల స‌మ‌న్వ‌య బాధ్య‌తను అప్ప‌గించారు. వాటిలో నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలు ఉన్నాయి. ఈ మూడు ఏపీ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్న ప్రాంతాలు.

తాను పూర్తి స‌మ‌యం కేటాయించ లేక పోతున్నాన‌ని, ద‌య‌తో త‌న‌ను పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త ప‌ద‌వి నుంచి త‌ప్పించాలంటూ బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు. కాగా కేబినెట్ నుంచి ఆయ‌న‌ను త‌ప్పించారు సీఎం. ఆయ‌న‌కు బ‌దులు జ‌గ‌న్ రెడ్డి ఆదిమూల‌పు సురేష్ ను మంత్రిగా కొన‌సాగించ‌డం ప‌ట్ల కొంత అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇదే స‌మ‌యంలో తాజాగా మార్కాపురంలో జ‌రిగిన కార్య‌క్రమంలో ప్రోటోకాల్ ర‌గ‌డ రాజీనామా చేసేందుకు కార‌ణ‌మైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏది ఏమైనా బాలినేని రాజీనామా పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది.

Also Read : భూ నిర్వాసితుల‌కు జ‌గ‌న్ భ‌రోసా

Leave A Reply

Your Email Id will not be published!