MLA Dwarampudi : దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేయి
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
MLA Dwarampudi : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిప్పులు చెరిగారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. తాను ఎవరిని వేధింపులకు గురి చేశానో చెప్పాలన్నారు. అవాకులు చెవాకులు పేలితే తాట తీస్తానన్నారు. మాటలు నీకు ఒక్కడికే వచ్చు అన్న భ్రమల్లో ఉన్నాయని, తాను రంగంలోకి దిగితే నీకు పుట్టగతులు ఉండవంటూ పవన్ కళ్యాణ్ ను హెచ్చరించారు.
గతంలో తన తండ్రికి బేడీలు వేసి తీసుకు వెళ్లారంటూ నోరు పారేసుకున్న పవన్ కాస్తంత వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బెటర్ అని హితవు పలికారు. నీకు దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి(Dwarampudi Chandrasekhar Reddy). నీపై తాను పోటీ చేస్తానని ఎవరు గెలుస్తారో చూసుకుందామన్నారు. తాను చేసిన సవాల్ ను ఎదుర్కొనే దమ్ము నీకు ఉందని తాను అనుకోవడం లేదన్నారు.
చేతకాని మాటలు మాట్లాడుతూ ఏపీ సీఎంను తిట్టిపోసినంత మాత్రాన లీడర్ వి కాలేవన్నారు వైసీపీ ఎమ్మెల్యే. నన్ను, సీఎం జగన్ రెడ్డిని ఓడించే సత్తా నీకు లేదన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి శనిలాగా దాపురించిన టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ లను తన్ని తరిమేయాలని అప్పుడు కానీ రాష్ట్రం బాగు పడదన్నారు.
ఇదిలా ఉండగా కాకినాడలో వారాహి విజయ యాత్ర సందర్బంగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఎమ్మెల్యేను ఏకంగా రౌడీ అంటూ సంబోదించారు.
Also Read : Chandrababu Naidu : కురుక్షేత్ర యుద్దం ప్రారంభం