MLA Harish Rao: పీఏసీ ఛైర్మన్‌గా అరికెపూడి ! హరీష్‌రావు సీరియస్ ?
పీఏసీ ఛైర్మన్‌గా అరికెపూడి ! హరీష్‌రావు సీరియస్ ?
MLA Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్‌ఎస్ బీఫామ్‌తో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న అరికెపూడి గాంధీకి ఏపీసీ ఛైర్మన్ పదవి ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. కాగా, మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పీఏసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షంలో ఉన్న వారికి ఇవ్వాలి. కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారికి కాదు. అరికెపూడి గాంధీకి ఎలా ఇస్తారు.
MLA Harish Rao Serious…
లోక్‌సభలో పీఏసీ ఛైర్మన్ కేసీ వేణుగోపాల్‌కు ఇవ్వలేదా?. రాహుల్ గాంధీ లోక్‌సభలో భారత రాజ్యాంగాన్ని పట్టుకుని మాట్లాడుతారు. కానీ, తెలంగాణలో మాత్రం రాజ్యంగం ఉండదా?. రాహుల్‌కు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఇదే సమయంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్(MLA Harish Rao) మాట్లాడుతూ..ఈరోజు 16వ ఆర్థిక సంఘాన్ని కలిశాము. ప్రస్తుతం ఉన్న 40 శాతం షేర్‌ను 50% పెంచాలని కోరాము. కానీ, ప్రస్తుతం ఉన్న 40% కూడా కాకుండా 31 శాతమే తెలంగాణకి షేర్ వస్తుంది.
దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంలో తెలంగాణ మారటానికి కేసీఆర్ చేసిన కృషిని ఆర్థిక సంఘానికి వివరించాము. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరాము. ఇంటింటికి నీరు అందించే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నిధులు ఇవ్వలేదు. హర్ ఘర్ జల్‌లో భాగంగా మిషన్ భగీరథకి రూ.2500 కోట్లు మెయింటెనెన్స్ ఇవ్వమని అడిగిన ఇవ్వలేదు అంటూ కామెంట్స్ చేశారు.
Also Read : Monkeypox: మంకీపాక్స్ పై రాష్ట్రాలకు కేంద్రం కీలక అదేశాలు !