MLA Maheshwar Reddy: ప్రభుత్వం నిమిషానికి కోటి రూపాయలు అప్పు చేస్తోంది: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ప్రభుత్వం నిమిషానికి కోటి రూపాయలు అప్పు చేస్తోంది: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

MLA Maheshwar Reddy : రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ… రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోనికి నెడుతోందని బీజేపీ  శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(MLA Maheshwar Reddy) ఆరోపించారు. రాష్ట్ర విభజన తరువాత మిగులు బడ్జెట్ తో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం అప్పు ఇప్పుడు రూ.8.6 లక్షల కోట్లుకు చేరుకుందన్నారు. రేవంత్ సర్కార్ రోజుకు రూ.1700 కోట్లకుపైగా అప్పు చేస్తోందని విమర్శించారు. బడ్జెట్‌పై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(MLA Maheshwar Reddy) మాట్లాడుతూ… ‘‘నిమిషానికి రూ.కోటికిపైగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రుణభారం రూ.2.27 లక్షలుగా ఉంది. పెద్ద ఎత్తున రుణాలుంటే తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలి. యూపీఏ కంటే ఎన్డీఏ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగాయి. యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో 32 శాతం వాటా ఉండేది. అప్పుడు కేంద్ర పన్నుల్లో వాటా 2-3 శాతం కూడా పెంచలేదు. మోదీ ప్రభుత్వం వచ్చాక కేంద్ర పన్నుల్లో వాటా 10 శాతం పెంచి 42 శాతం చేశారు. పన్నుల్లో వాటా పెంచాక కూడా కేంద్రాన్ని విమర్శించడం సరికాదు’’ అని ఆయన అన్నారు.

MLA Maheshwar Reddy  – బీఆర్ఎస్ పై కోపంతో అప్పుల లెక్క ఎక్కువ చేసి చూపొద్దు: హరీశ్‌రావు

బీఆర్ఎస్ హయాంలో చేసిన మొత్తం అప్పు రూ.4.22 లక్షల కోట్లు అని ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని పదే పదే చెప్పవద్దని… బీఆర్ఎస్ పై కోపంతో అప్పుల లెక్క ఎక్కువ చేసి చూపొద్దని కోరారు. శాసనసభలో హరీశ్‌రావు మాట్లాడారు. ఇది అవాస్తవిక బడ్జెట్‌… గాలి మేడల బడ్జెట్‌ అని తీవ్రంగా విమర్శించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… ‘‘కృష్ణా నదీ జలాలపై ఈ బడ్జెట్‌లోనే చర్చ పెట్టాలి. మీ నిర్వాకం వల్ల ఈ ఏడాది 34 శాతం వాడాల్సిన నీళ్లలో… 24 శాతమే వాడారు. ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పంటలు ఎండుతున్నాయి. నీటిని రాబట్టడంలో ప్రభుత్వం ఎలా విఫలమైందో చర్చించాలి. తెలంగాణకు వరంగా ఉన్న సెక్షన్‌3ని బీఆర్ఎస్ సాధించింది. ట్రైబ్యునల్‌ ముందు బలమైన వాదనలు వినిపించాలి. తెలంగాణకు న్యాయబద్ధమైన 575 టీఎంసీలను రాబట్టాలి’’ అని హరీశ్‌రావు అన్నారు.

Also Read : Rains: తెలంగాణాలో పలుచోట్ల అకాల వర్షాలు ! మరో రెండు రోజులు భారీ వర్ష సూచన !

Leave A Reply

Your Email Id will not be published!