Raghunandan Rao : నిరంజన్ రెడ్డి నిర్వాకం కబ్జాల పర్వం
ఎమ్మెల్యే రఘునందన్ రావు
Raghunandan Rao : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడరు. భారత రాష్ట్ర సమితికి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మంత్రి చెప్పేవి అన్నీ నీతులు అని కానీ ఆయన చేసేవన్నీ కబ్జాలేనని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తాను బయట పెడుతున్నానని, దమ్ముంటే మంత్రిపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.
ఆనాడు మంత్రిగా ఉన్న తమ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను బయటకు పంపారని, ఇప్పుడు తాము పూర్తి ఆధారాలతో బయట పెడుతున్నామని అన్నారు. తానేదో నీతి మంతుడైనట్లు నిరంజన్ రెడ్డి పదే పదే చెబుతుంటారని కానీ బండారం చూస్తే అవాక్కవడం ఖాయమన్నారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయడం, వాటిని బినామీల పేరుతో మళ్లించడం, లోన్లు తీసుకోవడం, తర్వాత తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం నిరంజన్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
80 ఎకరాలు కొనుగోలు చేసిన మంత్రి ఏకంగా 160 ఎకరాలకు ఫెన్సింగ్ వేశారంటూ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బయట పెట్టారు. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల భూ కబ్జాలకు అడ్డు లేకుండా పోయిందన్నారు. ప్రాజెక్టులకు కేటాయించిన భూములను ఆక్రమించి ఏకంగా మూడు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారంటూ ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు తప్పని తాను మొక్కే గుడిలో ప్రమాణం చేయాలని సింగిరెడ్డికి సివాల్ విసిరారు రఘునందన్ రావు(Raghunandan Rao).
Also Read : కబ్జాలు..ఫామ్ హౌస్ లు అబద్దం