MLA Raja Singh : ప్రవక్తపై కామెంట్స్ రాజాసింగ్ అరెస్ట్
అరెస్ట్ చేయాలంటూ భారీ నిరసన
MLA Raja Singh : తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. భారతీయ జనతా పార్టీ , టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది మాటల యుద్దం.
ముస్లింలకు చెందిన మత గురువు మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి హైదరాబాద్ లో. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
నిరసనకారులు, ఆందోళనకారులను చెదరగొట్టారు. బీజేపీకి చెందిన మలక్ పేట ఎమ్మెల్యే రాజా సింగ్(MLA Raja Singh) ను మంగళవారం అరెస్ట్ చేశారు. దీంతో నగరంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
మత విశ్వాసాలను కించ పరిచే విధంగా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి. సాయి చైతన్య వెల్లడించారు.
నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుట, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రవక్త మహమ్మద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత రాత్రి హైదరాబాద్ లో సమావేశం జరిగింది. ఆయనపై అవమానకరమైన కామెంట్స్ చేసినందుకు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు డిప్యూటీ కమిషనర్.
కాగా ప్రవక్త గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోను కూడా విడుదల చేశారంటూ వెల్లడించారు సాయి చైతన్య. తమ మనోభావాలను కించ పరిచేలా మాట్లాడిన రాజాసింగ్ ను అరెస్ట్ చేయానలి నిరసనకారులు డిమాండ్ చేశారు.
Also Read : మహాత్ముడు..మహనీయుడు..ఆదర్శప్రాయుడు