MLA Raja Singh: అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాస్ వార్నింగ్

అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాస్ వార్నింగ్

Raja Singh : బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దేశం వదిలిపోయేలా చేస్తామని హెచ్చరించారు. లేదా తాను బీజేపీలో జాయిన్ అవుతానని అసదుద్దీన్ ఒవైసీ తమ నేతల కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విషం కక్కుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. భయపడేవాళ్లు పాకిస్తాన్ పారిపోయారు… తాము కొట్లాడే వాళ్లం కాబట్టి ఇక్కడే ఉన్నాం అంటున్నాడు ఓవైసీ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ పారిపోయేది అసదుద్దీనే అని అన్నారు.

MLA Raja Singh

యూపీ తరహాలో తెలంగాణలో కూడా జమ్మికి నమాజ్ చేస్తే బాగుంటుంది అన్న యోగి ఆదిత్యనాథ్ మాటలకు అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. దీనితో అసదుద్దీన్ కి రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న హోలీ ప్రశాంతంగా జరగకూడదని అసద్దుద్దీన్ ఒవైసీ కుట్ర చేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో వయొలెన్స్ సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని అసదుద్దీన్ ఒవైసీ కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపణలు చేశారు. ‘అసదుద్దీన్ ఒవైసీ మెంటల్ అయిపోయిండు… రేవంత్ రెడ్డి గారు మీ కొత్త దోస్తులకు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపియండి’ అని రాజాసింగ్ సెటైర్లు గుప్పించారు.

Also Read : Telangana Secretariat: తెలంగాణ సచివాలయంపై డ్రోన్‌ చక్కర్లు ఇద్దరు అరెస్ట్‌

Leave A Reply

Your Email Id will not be published!